వరల్డ్ కప్ లో సంచలనం

 

వరల్డ్ కప్ 2015 లో సంచలనం జరిగింది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వన్డే ప్రపంచ కప్ గెలవని ఇంగ్లండ్ ఒక్కసారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్ కు చేరింది. దీంతో పాపం ఇంగ్లండ్ జట్టు ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఐదు మ్యాచ్లాడిన ఇంగ్లండ్ ఓ మ్యాచ్లో మాత్రమే గెలిచింది. బంగ్లాదేశ్ 7 పాయింట్లతో (3 విజయాలు, వర్షంతో ఓ మ్యాచ్ రద్దు) గ్రూపు-ఎలో మూడో స్థానంలో నిలిచింది. గ్రూపు- ఏ నుండి న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ కు చేరాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu