దినకరన్ అరెస్ట్...
posted on Apr 26, 2017 10:28AM

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఈసీ అధికారులకు లంచం ఇస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయనపైకేసు నమోదు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుండి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్ ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు దినకరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసినా, దినకరన్‌ను దాచిపెట్టారన్నది మల్లికార్జునపై ఉన్న అభియోగం. వీళ్లిద్దరినీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా విచారణలో దినకరన్ మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్‌ను తాను కలిసినట్లు అంగీకరించాడు.. అయితే, తాను అతడికి డబ్బులు మాత్రం ఏమీ ఇవ్వలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు.