టీడీపీలో టీఆర్ఎస్ విలీనం!

 

 

 

 

టీఆర్ఎస్ ని టీడీపీలో విలీనం చేయడానికి రెడీ అని ప్రకటించారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాకపోతే ఆయన మూడు కండీషన్లు పెట్టాడు. “పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు, బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అధికారంలోకి వస్తే తెలంగాణ బిల్లుమీద మొదటి సంతకం పెట్టాలి. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇవ్వాలి… ఈ మూడు అంశాల మీద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో స్పష్టత ఇస్తే టీఆర్ఎస్ ను టీడీపీలో విలీనం చేయడానికి ఎప్పుడయినా సిద్దం” అని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశాడు. టీఆర్ఎస్ ను టీడీపీలో విలీనం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు.

 


ఈ మూడు అంశాలమీద చంద్రబాబుతో స్పష్టత ఇప్పించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా ? అని హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ మీద టీడీపీ మోసపూరిత వైఖరి మరోసారి బయటపడిందని, పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే మోత్కుపల్లి, కేఎస్ రత్నం లాంటి వారికి కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ మీద డెడ్ లైన్లు పెడితే లొంగమని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా అంటున్నారని, అసలు డెడ్ లైన్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.