జయలలిత ఆరోగ్యానికి ఏమైంది..!
posted on Jul 13, 2015 6:47PM

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయలలితకు ఆరోగ్యం బాలేదంటూ పలు రకాలైనా వదంతులు వ్యాపిస్తున్నాయి. నిజానికి జయలలిత ఆరోగ్య సరిగా లేదని.. ఆమె తీవ్రమైన మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారని.. ముఖ్యంగా చక్కెర లెవెల్స్ తారా స్థాయికి చేరుకున్నట్టు సమాచారం. అందుకే ఆమె ముఖ్యమంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేసినా కూడా ఎక్కువగా ఇంట్లో ఉండే బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అరోగ్యం బాలేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు జయ ఆరోగ్యంపై అన్నాడీఎంకే పార్టీ నాయకుల కంటే మిగిలిన పార్టీ శ్రేణులే ఎక్కువగా కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జయ ఆరోగ్యం గురించి చెప్పాలంటూ వాదనలు చేస్తున్నారు. డీఎంకే నేత స్టాలిన్ మరో అడుగు వేసి అసలు తమిళనాడులో ప్రభుత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన జయ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఘాటుగా స్పందించారు.