రివర్స్ టెండరింగ్‌లో మరో ట్విస్ట్... ఇసుకపై జేసీలకు అధికారం

పాలనలో పారదర్శకత చూపుతున్న ఏపీ సీఎం జగన్ మరో ముందుడుగు వేశారు. రివర్స్ టెండరింగ్ పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బిడ్డింగ్ లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే రివర్స్ టెండరింగ్ లో ఛాన్స్ కల్పించనున్నారు. అలాగే, పది లక్షలు నుంచి వంద కోట్ల టెండర్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. జనవరి ఒకటి నుంచి కొత్త విధానం అమలు చేయనున్నారు. విధాన రూపకల్పన, పారదర్శకత శాశ్వతంగా ఉండే విధంగా పాలసీ రూపొందిస్తున్నారు. ఇక జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ సంబంధిత కార్యకలాపాల సమన్వయం కోసం ఐఏఎస్ అధికారిని నియమించారు.

మరోవైపు, ఇసుక కొరతపైనా జగన్ దృష్టిపెట్టారు. ఇసుక సరఫరాపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ‌్యంలో చర్యలు చేపట్టారు. నూతన విధానం సక్రమంగా అమలుతోపాటు ఇసుక కొరత లేకుండా చేసేందుకు జాయింట్ల కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇసుక తవ్వకాల నుంచి సరఫరా వరకు అన్నీ జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలని జగన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu