టీడీపీలోకే రాయపాటి

 

 

 

గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఒకటి రెండు రోజుల్లో రాయపాటి టీడీపీలో చేరబోతున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటి టీడీపీ తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు నరసరావుపేట సిటింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని గుంటూరు పశ్చిమ నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు సూచించినట్లు తెలియవచ్చింది.

 

రాయపాటిపై కాంగ్రెస్ అథిష్టానవర్గం బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరేదీ తేల్చుకోలేకపోయారు. ఈ మధ్య కాలంలో రాయపాటి శిష్యునిగా పేరుపొందిన డొక్కా ఆయనకు మళ్ళీ కాంగ్రెస్‌లోకి రప్పించడానికి ఢిల్లీలో యత్నించినట్లు తెలిసింది. అయినా ఫలితం దక్కలేదు. ఒక దశలో రాయపాటి సమైక్యాంధ్ర నినాదంతో తెరపైకి వచ్చిన కిరణ్‌తో చేతులు కలుపుతారనుకున్నారు. అదీ జరగలేదు. చివరకు సైకిలెక్కాలనే రాయపాటి నిర్ణయించుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu