పొన్నం చేసిన వేశ్య వ్యాఖ్యలపై మహిళా జేఏసీ ఫిర్యాదు

 

 

Ponnam lands in troubles, Ponnam undavalli arun kumar, Ponnam prabhakar comments

 

 

రాజమండ్రి ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ పెద్దాపురం వేశ్యగా పోల్చడం పై సమైక్యాంధ్ర మహిళా జెఎసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ పట్టణంలోని మూడవ పట్ణణ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ను పొన్నం పెద్దాపురం వేశ్యతో పోల్చారు. ఆయన వేశ్యకన్న హీనమని పొన్నం విమర్శించారు.


అయితే దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. పెద్దాపురం వేశ్య అని అన్న నేపథ్యంలో ఈ విధంగా మహిళలను కించపరచడం అన్యాయమని, మహిళల మనోభావాలను దెబ్బతీశారని మహిళా జేఏసీ తప్పుపట్టింది. తెలంగాణ కావాలంటే తెచ్చుకోవచ్చని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు స్థాయి దిగజారి మాట్లాడవద్దని వారు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu