ఎంపీలకు మోడీ ఆదేశం.. ఏడు రోజులు అక్కడే ఉండండి..
posted on May 10, 2016 6:26PM

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ నేతలకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎంపీలు ఎవరి నియోజక వర్గాల్లో వారు ఏడు రోజుల పాటు ఉండాలని.. రాత్రుళ్లు కూడా అక్కడే బస చేసి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారట. అంతేకాదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి ప్రచారం చేయాలని.. అలాగే ప్రజల స్పందన, వారు ఏం కోరుకుంటున్నారో జాబితా తయారుచేసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనలను తిరిగి ప్రధాని మోడీకి తెలియజేయాలని సూచించినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. మరీ మోడీ చెప్పినట్టు ఎంపీలు చేస్తారో, చేయరో చూడాలి.