'బాద్ షా' ఆడియోకి స్పెషల్ గెస్ట్

 

NTR Baadshah Audio Songs, Baadshah Audio Songs,Baadshah Audio List, Baadshah Audio Songs, BaadshahSongs

 

ఈ వేసవిలో టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడాని ఎదురుచూస్తున్న సినిమాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' మూవీ ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ఆడియో ను శివరాత్రి రోజు గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ ఆడియో రిలీజ్ వైవిధ్యంగా చెయ్యనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు హైలైట్ గా ఓ స్పెషల్ గెస్ట్ రానున్నారని, ఆయన పేరును బండ్ల గణేష్ సీక్రెట్ గా వుంచారని తెలుస్తోంది.

 

మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే  'బాద్ షా' మూవీ ఓపెనింగ్ కు మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ను గెస్ట్ గా పిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు ప్రొడ్యూసర్ గణేష్. మరీ ఈ సారి వచ్చే అతిథి ఎవరో తెలుసుకోవాలంటే 'బాద్ షా' పాటల వేడుక వరకు ఆగాల్సిందే. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu