లోకేశ్ నోట మీడియా మాట..
posted on Apr 28, 2016 2:58PM

తన తండ్రికి కనీసం మనమడితో ఆడుకునేంత తీరిక కూడా లేదని.. రాష్ట్ర అభివృద్దికోసం రోజులు 18 గంటలు మీటింగులతోనే బిజీగా.. ఒక కుర్రాడిలా కష్టపడుతున్నారని.. నారా లోకేశ్ అన్నారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 65 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.. ఈ విషయంలో మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. మీడియా గురించి ప్రస్తావించారు. మన పార్టీకి ఎలాంటి ఛానెళ్లు లేవు.. పత్రికలూ లేవూ.. కార్యకర్తలే మన పార్టీ బలం అని అన్నారు. అందుకే ప్రజా వ్యతిరేక వార్తలు రాసే కొన్ని మీడియా సంస్థల విషయంలో గందరగోళం చెందవద్దు. పార్టీ కార్యకర్తలు అసలు విషయాలను వారికి వివరించాలి” అని లోకేష్ సూచించారు. కాగా గతంలో నారా లోకేశ్ ఓ టీవి ఛానల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.