కర్నూలులో కూడా తెదేపా అభ్యర్డిదే విజయం

 

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెదేపా అభ్యర్ధి శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించారు. మొత్తం 1080 ఓట్లలో చక్రపాణి రెడ్డి 610 ఓట్లు సాధించి తన సమీప వైకాపా ప్రత్యర్ధి వెంకటేశ్వర రెడ్డిపై 146 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రకాశం జిల్లాలో కూడా తెదేపా అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డి భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu