డైరెక్టర్ మణిరత్నం ఇంటిని ముట్టడించిన బయ్యర్లు

 

 

 Maniratnam's Kadali, Maniratnam's Kadali movie,  maniratnam kadali telugu movie

 

 

మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కడల్‌' చిత్రం తమను నష్టాల పాల్జేసిందంటూ చిత్ర బయ్యర్లు ఆందోళనకు దిగారు. ఈ సినిమా తమిళ వెర్షన్ బయ్యర్లకు భారీ లాసులు మిగిల్చిందని వార్త. దీంతో చిత్రంతో తమకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ బయ్యర్లు దర్శకుడు మణిరత్నం మీద పడ్డారు.


ఈ సినిమాకు దర్శక, నిర్మాతగా వ్యవహరించిన మణి తమకు ఏదో ఒక దారి చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలోని మణి ఇంటి ముందు వారు ఆందోళనకు దిగారు.  ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయూమని బయ్యర్లు వాపోయారు. నష్టాన్ని భర్తీ చేయూలంటూ చెన్నై అడయార్‌లోని గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న మణిరత్నం ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. వారిని అదుపు చేయడానికి మణిరత్నం ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu