ధర్మాన ఫైల్ వెనక్కి పంపిన గవర్నర్...కిరణ్ పై డీఎల్ ఫైర్
posted on Dec 21, 2012 3:38PM

ధర్మాన ప్రాసిక్యూషన్ వ్యవహారంపై మరోసారి కాంగ్రెస్‌లో చిచ్చురేగింది. ధర్మాన ఫైలును గవర్నర్ తిప్పిపంపడంతో తదుపరి చర్యలపై పలువురు మంత్రులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరుపుతున్న సమయంలో మరో మంత్రి డీఎల్ సీఎంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. సీబీఐ, కోర్టుల తప్పు చూపినప్పటికీ ధర్మానను వెనుకేసుకు రావడం సరికాదని మండిపడ్డారు.
ధర్మాన విషయంలో గవర్నర్ సూచన ప్రభుత్వానికి ఇబ్బందకరమే అన్నారు. కేబినేట్ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదన్నారు. సబంధిత శాఖ-మంత్రికి సంబంధం లేకపోతే ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్న సుప్రీం నిర్ణయాన్ని డీఎల్ గుర్తుచేశారు. మరోసారి ధర్మాన ఫైలు కాబినేట్ ముందుకు వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సహచర మంత్రిగా ధర్మానపై ప్రాసిక్యూషన్ కోరానన్న బాధ తనకు ఉందని మంత్రి డీఎల్ ర వీందర్‌రెడ్డి అన్నారు.