కేశవరావుకు ఫ్యాన్ ని: కేసీఆర్

 

 keshavarao kcr, kcr telangana, telangana kk kcr

 

 

కేసీఆర్ అధ్యతన టీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల సెక్రెటరీ జనరల్‌గా కేకే బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అనే అంశమే తమను కలిపిందన్నారు. కేకేకు పదవి ఇచ్చేంత శక్తి సామర్థ్యాలు తనకు లేవన్నారు. కేకేకు అధ్యక్షుడి తర్వాత అధ్యక్షుడి అంత హోదా ఇచ్చామన్నారు. టీఆర్ఎస్ తరపున జాతీయ స్థాయిలో చక్రం తిప్పేబోయేది కేకే అని ఆయన అన్నారు. ఒకప్పుడు తాను కేకే అభిమానినని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా వెళ్లేది టీఆర్ఎస్సే అని స్పష్టం చేశారు.