ఆపరేషన్ దిగ్విజయ్

 

మంత్రివర్గ విస్తరణలో కావూరి, శీలంలకు పెద్ద పీట వేయ్యడం ద్వారా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో పట్టుసాధించ వచ్చనేది కాంగ్రెస్ యోచన. ఆ ప్రాంతాలను వారిరువురూ ప్రభావితం చేయగలరని కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. జె.డి.శీలం ద్వారా ఆయన సామజిక వర్గానికి చెందిన వారి ఓట్లను చేజిక్కించుకోవాలని యోచించింది. ఇక, ఇప్పటి వరకూ సమైఖ్యవాదాన్ని బలంగా వినిపించిన శీలం,కావూరి అకస్మాత్తుగా మెత్తబడి తెలంగాణాపై అధిష్టానం ఇచ్చే తీర్పుని గౌరవిస్తానంటూ లైన్ క్లియర్ చేశారు కనుక రాష్ట్రంలో సీమంద్రా వైపు నుండి తెలంగాణా వ్యతిరేఖత కొంత మేర తగ్గించుకొన్నట్లయింది. ఇక సమైక్యవాదులయిన లగడపాటి, శైలజానాథ్ వంటి పార్టీకి విధేయులయిన మిగిలిన వారిని కూడా నియంత్రించడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద కష్టమేమి కాదు గనుక ఇక తెలంగాణాపై నిర్దిష్ట ప్రకటన చేయడానికి రంగం సిద్దం చేసుకొంటోంది.

 

అందుకే ఆయన ఇంచార్జ్ గా బాధ్యతలు చెప్పటిన వెంటనే ఈ నెలాఖరులోగా రాష్ట్రాన్ని పర్యటించబోతునట్లు తెలియజేసారు. ఆయన తన పర్యటనలో సమైక్యవాదులయిన మిగిలిన నేతలతో కూడా సంప్రదింపులు జరిపి తెలంగాణా ప్రకటనకు మార్గం సుగమం చేసే ప్రయత్నాలు చేయవచ్చును.

 

ఇక,  దిగ్విజయ్ సింగ్ గతంలో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్ ఘడ్ వేరు చేసి కొత్త రాష్ట్రం సృష్టించడంలో బీజేపీకి పరోక్షంగా చాలా సహాయం చేసి ఉన్నందున ఆ అనుభవంతో ఆయన తెలంగాణా సమస్యను కూడా పరిష్కరించగలదని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం.

 

ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం జటిలమయిన తెలంగాణా సమస్యని పరిష్కరించగలిగితే, రానున్న ఎన్నికలను దైర్యంగా ఎదుర్కొనగలదని అభిప్రాయ పడుతోంది. తద్వారా, కేవలం తెలంగాణా వాదంతోనే కాంగ్రెస్ ను చావు దెబ్బ తీయలనుకొంటున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కు చెక్ బెట్టి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. మరి కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు దిగ్విజయంగా ఈ వ్యవహారం దిగ్విజయ్ సింగు చక్కబెట్టగలరో లేదో చూడాలి.