వోటు బ్యాంకు పాలిట్రిక్స్ కు కెసీఆర్ సిద్దం

భారత రాష్ట్ర సమితి  అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలతో పార్టీ ఔట్రీచ్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ, రాబోయే కొద్ది నెలల్లో సంక్షేమ పథకాలను  అమలు చేయడం ద్వారా తన ఓటు బ్యాంకులను పదిలపర్చుకోవాలని చూస్తోంది. 

రానున్న రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంఘాలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయడంతోపాటు గృహలక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి  దళిత బంధు పక్కాగా అమలు చేయాలని చూస్తోంది. 
 పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ,  గొర్రెలను అందజేయాలని ప్రణాళిక సిద్దం చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. 

అసెంబ్లీ ఎన్నికల్లో  లబ్ధిదారుల మద్దతు కోరడానికి ఇది చక్కటి అవకాశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులు ఆర్బాటంతో  ఈ పథకాలు లబ్ధిదారులకు అందేలా  చూస్తారు. 

పోడు భూముల పట్టా కార్యక్రమాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జూన్ 24 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.  అధికార పార్టీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. వెల్ఫేర్, డెవలప్మెంట్  కార్యక్రమాలను  ప్రచారం నిర్వహించి లబ్ది పొందాలని చూస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu