బొత్సని టార్గెట్ చేసిన కేసీఆర్

 

 

kcr botsa satyanarayana, kcr chandrababu, kcr kiran kumar reddy

 

 

గత కొన్నిరోజులుగా టిడిపిని టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిపై పడ్డాడు. బొత్సవి తిక్కమాటలని తేల్చాడు. బయ్యారంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తలతిక్క మాటలు మానుకోవాలని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. బయ్యారం గనులపై మే నెలలో మహా ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. బయ్యారం గనుల్లో నాణ్యత లేదని బొత్స అసత్య ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బయ్యారంపై విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ పై కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న సీఎం కిరణ్‌ పార్టీకి ఒక్క ఓటు వేయొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుకు ఒక్క సీటు రాకుండా చేయాలని ప్రజలకు కేసీఆర్‌ సూచించారు. మొత్తానికి బయ్యారం విషయంలో కూడా సీట్ల విషయంలోనే మాట్లాడటం కేసీఆర్ అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోంది!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News