కడియం వారి తెలంగాణ ప్రేమ!

 

 

 kadiyam tdp, kadiyam trs, telangana issue kadiyam sri hari

 

 

తెదేపాకి కడియం శ్రీహరి గుడ్ బాయ్ చెప్పేసారు. మే 15,16 తేదీలలో తెరాసలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యం. ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగటం అనేది వారి స్వేచ్ఛ. కాని పార్టీని వీడే కారణాలలో ఏ పార్టీ నాయకులైనా నీతి, నిబద్ధతలు పాటించటం లేదు. ఎందుకని? మళ్ళీ వాళ్ళే చెబుతారు, ప్రజలు అంతా గమనిస్తున్నారు అని. మరి ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని గ్రహించి కూడా ఇలా ఎలా బరితెగింపు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలు దేనినీ పట్టించుకునే తీరికలో లేరు కాబట్టి.


 

ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసానని చెబుతున్నారు. తెరాస ఆవిర్భవించి 12 సంవత్సరాలు అయింది. గతంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖ, మార్కెటింగ్ శాఖ, నీటిపారుదల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖవంటి పలు కీలకమైన మంత్రి పదవులు అనుభవించినప్పుదు గుర్తుకురాని తెలంగాణ అంశం, ఈ రోజున ఇంత హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చింది? 2009 ఎలెక్షన్లలో తెరాస తెదేపాతో పొత్తు పెట్టుకునప్పుడు క్కూడా లేని తెలంగాణ ప్రేమ ఈ రోజు ఎందుకు పొంగి పొర్లుతుంది?

    

అన్నిటికీ మించి గత సంవత్సరం డిశంబరులో జరిగిన తెలంగాణపై అన్ని పార్టీల అఖిల పక్ష సమావేశానికి తెదేపా నుండి ఆ పార్టీ ప్రతినిధిగా యనమల రామకృష్ణుడు తో పాటు కడియం కూడా పాల్గొన్నారు.పాల్గోనటమే  కాదు, ఆ రోజు ఆయన 2008 లో ఇచ్చిన లేఖకు తమ పరి కట్టుబడే ఉందని అఖిలపక్ష సమావేశంలో వెల్లడించి తదుపరి ప్రెస్ మీట్లో తమ పార్టీ తెలంగాణ కి అనుకూలమే కానీ వ్యతిరేకం కాదు అని వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రజల మనోభావాలకు పార్టీలో గుర్తింపు లేనందుకే తాను పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు కడియం వెల్లడించటం వెనుక అతడి రాజకీయ ఆంతర్యం ఏమిటి? పార్టీ వేరు , అధిష్ఠానం వేరు కాదు కదా? అధిష్ఠానం సూచనల మేరకు, అధిష్ఠానం అభిప్రాయం మేరకు ఆ రోజు వెల్లడించిన నిర్ణయం ఈ రోజు ఎందుకు వ్యతిరేఖ నిర్ణయం అని వక్కాణిస్తున్నారు?

      

1999 నుండి తెదేపాలో నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తలూ, పార్టీలు మారి వచ్చిన వారే తీసుకుంటున్నారని వెల్లడిస్తున్న ఆయన, 1999 నుండి 2004 వరకు విభిన్న రకాల మంత్రి పదవులు ఎలా వెలగబెట్టారు? ఆ నాడు గుర్తుకురాని తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల మనోభావాలు ఈ రోజు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? ఐనా తెలంగాణ లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెదేపా హయాంలోనే అన్న విషయం ఆయన మర్చిపోయారా? లేక అభివృద్ధి అసలు జరగలేదు అంటే మరి 9 1/2 ఏళ్ళు మంత్రిగా ఉండి కడియం ఎం చేసారు?

   

   తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడా? సోనియా గాంధీనా? మే 27న జరగబోయే తెదేపా మహానాడులో తెలంగాణ పై చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటనా చేసే ఆలోచనలో లేరని కడియం వ్యాఖ్యానిస్తున్నారు. మహానాడులో చంద్రబాబు నాయుడు తెలంగాణా పై నిర్ణయం ప్రకటిస్తే తెలంగాణ వచ్చేస్తుందా? ఆ మారం రాజకీయ పరిగ్న్యానం లేకుండా కడియం ఉన్నాడా? 9 1/2 ఏళ్లపాటు మంత్రిగా వెలిగినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టినందునే తమ పతి అధికారం వేలగబెట్టిందని కడియం మర్చిపోయారా? సభ్యతా, సంస్కారం కలిగిన రాజకీయ అనుభావజ్ఞుడిగా కాక అధికార దాహంతో రగిలిపోతున్న  పక్కా స్వార్థ రాజకీయవేత్తగా మాట్లాడటం కడుశోచనీయం.

 

      నేడు తెదేపాని, చంద్రబాబు నాయుడు వైఖరిని ఇంత ధైర్యంగా దుయ్యబడుతున్న కడియం శ్రీహరి అంతే ధైర్యంతో ఏ ప్రలోభాలకు లొంగి ఎలాంటి రుగ్మతలకు బానిసై తెరాస లో కేసీఆర్ పంచన చేరుతున్నాడో చెప్పే సత్తా ఉందా?