జగన్ కోసం జైలుకు దాడి
posted on May 3, 2013 4:27PM
.jpg)
తనను పాదయాత్రలో దూరంగా పెట్టారని, తనను చూస్తేనే అసహ్యించుకుంటున్నారని తెలిసి దూరంగా ఉన్నట్లు దాడి వీరభద్రరావు తెలిపారు. 30 ఏళ్లుగా పనిచేసిన పార్టీని వీడుతుంటే కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారని దాడి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నందకు తనకు బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. తనను పలు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని ఆయన తెలిపారు. యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. శనివారం ఉదయం చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను ములాఖత్ సమయంలో భేటీ అవుతున్నట్లు దాడి చెప్పారు. తమకు ఏవిధంగా ప్రాధాన్యత ఇస్తారో, పార్టీ విధి విధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. జగన్ సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని, జగన్ జవాబులు సంతృప్తినివ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని దాడి ప్రకటించారు.