పెళ్లి కాలేదని యువతి...

తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం మద్దివంచకు చెందిన శిరీష పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఎంతసేవటికీ శిరీష ఇంటికి రాకపోవడంతో తన సోదరుడు ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. తన సోదరుడు కంగారుపడుతుండగా ఇంతలో 'అన్నయ్యా.. అమ్మను బాగా చూసుకో.. నాన్న జాగ్రత్త.. ఇక నేను ఎప్పటికీ మీకు కనపడను. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుటుంబంలోనే పుట్టాలని ఆ దేవుణ్నికోరుకుంటా' అని మెసేజ్ పెట్టింది. తర్వాత సెల్ ఫోన్ స్విఛాఫ్ చేసిన శిరీష రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu