బతకనీయండర్రా ఆడపిల్లలని

 

 

బతకనీయండర్రా

 

ఆడపిల్లలని....

 

ఒక్కసారి "ఆడదని" కాకుండా
ఆవేశం అంచుల్ని తాకే
తన ఆత్మవిశ్వాసాన్ని చూడండి

ఎప్పటికప్పుడు
తనని తాను సరికొత్తగా
ఆవిష్కరించుకుంటూ
తనతో తానే పోటీపడుతూ
తనకి తానే సాటిగా ఎదుగుతున్న
అడ పిల్లలో ఆడతనాన్ని మాత్రమే ఎలా చూస్తున్నారు?

అడుగడుగునా...
తన అధికారాన్ని ప్రశ్నించటానికి
తన ఉనికిని కాలరాయటానికి
మీ నిక్రుష్ట మగతనాన్ని
వాడుకుంటూ
తనకి కేవలం... ఆడదానిగా
చూడకండి.

బతకనీయండర్రా ఆడపిల్లలని

 

...రమ