24 గంటల డెడ్ లైన్: చంద్రబాబు

 

 Chandrababu Fire On Congress, telangana, congress, chandrababu, jagan, kcr, ysr congress, telangana note

 

 

తెలంగాణ నోట్ కు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టె రీతిలో లెక్కలేనితనంతో వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ''24 గంటల సమయం ఇస్తున్నాం. చర్చల ప్రక్రియ మొదలు పెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. మా పార్టీపరంగా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాం'' అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.


'ఎక్కడ నుంచి మీకింత ధైర్యం వచ్చింది? అటూ ఇటూ చెరొకరు ఉన్నారనే కదా? మీకు ఓట్లు వేయకపోయినా వాళ్ళకు వేస్తారనే కదా? జగన్ సోనియాను ఒక్క మాట అనడు. రెండు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడాలని చెప్పిన నన్ను తిడతాడు. ఈ వ్యవహారంలో నెంబర్ వన్ క్రిమినల్ అయిన సోనియా పేరే ఎత్తకుండా నా గురించి మాట్లాడటానికి సిగ్గుందా? జగన్‌తో ఒప్పందం కుదరగానే విభజనపై కాంగ్రెస్ ముందడుగు వేసింది. జగన్‌పై వేసిన కేసులకు ఆధారాలు లేవని ఢిల్లీలో మెమో తయారు చేసి విమానంలో హైదరాబాద్ పంపి కోర్టులో దాఖలు చేయించారు. అందుకే సోనియా గురించి మాట్లాడకుండా జగన్ మమ్మల్ని తిడుతున్నారు' అని చంద్రబాబు విమర్శించారు.