చంద్రబాబు కత్తులు,కొడవళ్ళు..కాంగ్రెస్ ఫైర్

 

 chandrababu congress, congress chandrababu, chandrababu padayatra, botsa chandrababu

 

 

గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా కత్తులు, కొడవళ్లతో తిరగబడాలని పిలుపు ఇవ్వడం పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొందరు మురళి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని అన్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని, కత్తులు,కొడవళ్లతో రోడ్డెక్కాలని అని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకునే విషయంపై ఆలోచన చేస్తామని కోండ్రు హెచ్చరించారు.


ఇదే వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. కాంగ్రెస్ ను చంపడం చంద్రబాబు జేజెమ్మ వల్ల కూడా కాదని ఆయన పేర్కొన్నారు.కత్తులు,కొడవళ్లు పట్టుకోమని తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి వాడవలసిన భాష ఇదేనా అని బొత్స ప్రశ్నించారు. గతంలో ఇలా చాలామంది మాట్లాడారని, వారంతా ఏమయ్యారో తెలుసుకోండని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బొత్స కోరారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu