విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
posted on Sep 22, 2015 3:14PM
.jpg)
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మధ్య అనేక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల సమస్య. తెలంగాణ ప్రభుత్వం స్థానికత ఆధారంగా సుమారు 1200 మంది ఉద్యోగులను రివీల్ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం కూడా అక్కడ ఖాళీలు లేవని చెప్పడంతో వారి పరిస్థితి అయోమయ స్థితిలో పడింది. ఆఖరికి ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు అనేక విచారణల అనంతరం ఎట్టకేలకు విద్యుత్ ఉద్యోగులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని.. నాలుగు వారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 58 శాతం, తెలంగాణ రాష్ట్రం 42 శాతం జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు తమ తుది తీర్పు వరకు ఉద్యోగులు తెలంగాణకే చెందుతారని హైకోర్టు చెప్పడంతో ఉద్యోగులకు ఊరట లభించింది.