హీరోయిన్ జియాఖాన్ 25 ఆత్మహత్య
posted on Jun 4, 2013 11:32AM

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో ఎత్తుపల్లాలు, సుఖదుఃఖాలు చూడకనే జీవితం చాలించింది. ఇంతవరకు ఆమెకు పెద్దగా కష్టాలున్నట్లు కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ అనూహ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం అయ్యింది. రాంగోపాల్ వర్మ తీసిన నిశ్శబ్ద్ ద్వారా ఆమె సినిమాకు పరిచయం అయ్యింది. అమితాబ్ బచ్చన్ సరసన హాట్ గా కనిపించింది. ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయినా జియా మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. బోల్డ్ గా కనిపించి యువకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. నటనలోనూ నైపుణ్యం చూపి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డేబ్యూ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత గజిని హిందీ వెర్షన్లో కనిపించింది. ఆ తర్వాత 2010 లో వచ్చిన హౌస్ ఫుల్ ఆమె చివరి చిత్రం. జియా ఆత్మహత్య వార్త తొలుత దియామీర్జా ట్విటర్ మెసేజ్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న జుహు ప్రాంతం ఇపుడు హాట్ ప్లేస్. స్థానికులన విచారించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సాయంత్రం లోపు రిపోర్టు వస్తే కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.