ఆర్యా తో తాప్సీకి లింకుందా?

 

వరుడు సినిమాలో విలన్ గా నటించిన ఆర్యాతో తాప్సీ మద్రాస్ వీథుల్లో చెట్టాపట్టాలు వేసుకుని తెగ తిరిగేస్తుందని చెన్నపట్నంలో అందరూ చెప్పుకుంటున్నారు. విష్ణువర్థన్ దర్శకత్వంలో వీళ్ళిద్దరూ ఒక కొత్త సినిమాలో నటిస్తున్నారు. తాప్సీ మాత్రం ఆర్య నా కోస్టార్ మాత్రమె అంటూ చక్రాల్లాంటి కళ్ళను తెగ తిప్పెసుకుంటూ ముద్దు ముద్దుగా చెబుతోంది. గతంలో కూడా తాప్సీకి మరికొందరు హీరోలతో లింకుందని పుకార్లు షికార్లు చేశాయి. "ప్లీజ్ ఇలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇరకాటంలో పెట్టకండి'' అంటూ ఈ తెల్లతోలు పిల్ల మీడియాని దాటేసుకుని షూటింగ్ స్పాట్ కి చెక్కేస్తోందట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu