ఎయిర్ పోర్టులో కాల్పుల కలకలం..
posted on Aug 29, 2016 10:41AM

గత కొద్ది రోజుల నుండి అగ్రరాజ్యమైన అమెరికాలో వరుస కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక ఘటన జరిగి దానిని ప్రజలు మరిచిపోయే లోపే మరో ఘటన జరిగి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. లాస్ ఏంజిల్స్ లోని ఎయిర్ పోర్టులో కాల్పులు చోటుచేసుకోవడంతో వెంటనే స్పందిచిన భద్రతా దళాలు, ఎయిర్ పోర్టును మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు కాల్పులకు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు తుపాకితో ఎయిర్ పోర్టులోకి ఎలా ప్రవేశించాడన్న విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.