apple water proof mobiles

ఆపిల్ వాటర్ ఫ్రూఫ్ ఫోన్లు

ప్రముఖ మొబైల్ సంస్థ ఆపిల్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇతర మొబైల్ కంపెనీలకు పోటీగా వాటర్ ఫ్రూఫ్ మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చే పనిలో ఉంది. సోనీ నుండి వస్తున్న వాటర్ ఫ్రూఫ్ మోడళ్లకి ధీటుగా సవాల్ విసురుతోంది. ఇందుకోసం ఆపిల్ ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోఫోబిక్ కోటింగ్ ను వినియోగిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే పేటెంట్ రైట్స్ కోసం యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ లో దరఖాస్తు చేసింది. మొబైల్ లోని ప్రధాన విడిభాగాలన్నింటిపైనా ఈ రసాయనం పూత పూస్తారు. అలాగే విడిభాగాలు కలిపే చోట షార్ట్ సర్క్యూట్ కాకుండా సిలికాన్ సీల్ ను వినియోగిస్తారు. దీనివల్ల నీళ్లు లోపలికి పోయినా ఫోన్ కు ఏ సమస్యా రాదు. ఇతర మోడళ్లతో పోలిస్తే ఇవి కొంచెం మందంగా ఉంటాయి.

asus tablets new products

అసూస్ నుండి రెండు కొత్త ప్రొడక్ట్స్

ప్రముఖ మొబైల్ సంస్థ అసూస్ మార్కెట్ లోకి కొత్త టాబ్లెట్ లు ఫోన్ ప్యాడ్ 7, మెమోప్యాడ్ 8ను భారత్ లో విడుదల చేసింది. ఇవి ప్రత్యేకంగా ఆన్ లైన్ సైట్ లో ఫ్లిప్ కార్టులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ప్యాడ్ ధర భారత్ లో రూ. 10,999. మెమోప్యాడ్8 ధర రూ. 19,999. ఫోన్ ప్యాడ్7 ప్రత్యేకతలు: ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఇంటెల్ ఆటమ్ జెడ్2520 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇన్ బిల్ట్ మెమరీ. మెమోప్యాడ్8 ప్రత్యేకతలు: ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్, 12 ఎంపీ కెమెరా, 8 ఎంపీ డిస్ ప్లే, 64 బిట్ ఇన్ టెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ.

new samsung phone galaxy 6

గెలాక్సీ 6 వచ్చేస్తోందోచ్

  యాపిల్ సంస్థతో పోటీపడగల సత్తా వున్న శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ గెలాక్సీ ఎస్ 6, గెలాక్సీ ఎస్ 6 ఎడ్జ్ పేర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లలను ఆవిష్కరించింది. యాపిల్ సంస్థ విక్రయిస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఫ్లస్‌లకు పోటీగా భావిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను ఏప్రిల్ 10 నుండి భారత్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకేసారి చేపట్టనుంది. గెలాక్సీ ఆరోతరం ఫోన్లుగా భావించే ఈ ఫోన్లను శామ్‌సంగ్ సంస్థ సీఈఓ జేకే షిన్ ఆవిష్కరించారు. ఈ ఫోన్లకు 5.1 అంగుళాల క్వాడ్ హెచ్ డీ సూపర్ ఆమాల్డ్త్ టచ్ స్ర్కీన్‌తో పోటు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 14 నానో మీటరు మొబైల్ ప్రాసెసర్లను అమర్చినట్టు తెలిపారు. ఈ ఫోన్ తయారీకి ఉపయోగించిన లోహం ఇతర లోహాల కంటే 50 శాతం కఠినంగా ఉంటుందని, వంగే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేకతలు ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఓఎస్, 1.5 గిగాహెర్జ్ కోర్టెక్స్ ఏ54, 2.1 గిగాహెర్జ్ కోర్టెక్స్ ఏ57 ప్రాసెసర్లు, 3 జీబీ ర్యామ్, 32-64-128 జీబీ ఇన్నర్ మెమొరీ, 5-16 ఎంపీ కెమరాలు, 2550 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. శామ్ సంగ్ గేర్ వీఆర్ హెడ్ సెట్ గెలాక్సీ ఎస్ 6, ఎస్ 6 ఎడ్జ్ లకు అనుసంధానించేందుకు వీలుగా సెకండ్ జనరేషన్ హెడ్ సెట్ గేర్ వీఆర్ ను కూడా ప్రదర్శించింది.

apple inc electrical car

యాపిల్ నుంచి కారు రాబోతోంది...

  ఇప్పటి వరకూ ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజంలా వున్న యాపిల్ సంస్థ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోకి కూడా ఎంటరవబోతోంది. అది కూడా ఒక ఎలక్ట్రిక్ కారుతో ఈ రంగంలోకి ప్రవేశించాలని యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారు రూపకల్పన కూడా ఆల్రెడీ జరిగిపోతోందట. ఈ రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో వున్న జనరల్ మోటార్స్, నిస్సాన్, టెస్లా కార్లకు ధీటుగా ఎలక్ట్రిక్ కారును యాపిల్ సంస్థ రూపొందిస్తోందట. అమెరికాలో ఒక రహస్య ప్రదేశంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఈ కారు రూపొందుతోందట. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. యాపిల్ సంస్థ రూపొందించే కారు ఒక మినీ వ్యాన్ మోడల్లో వుంటుందట. ఈ కారు మార్కెట్లోకి రావడానికి ఇంకా కొద్ది సంవత్సరాలు పట్టే అవకాశం వుందట. అయితే ఈ విషయంలో యాపిల్ వర్గాలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈమధ్యకాలంలో యాపిల్ సంస్థ వందలాది మంది కార్ల తయారీ నిపుణులను రిక్రూట్ చేసుకుంది.

Facebook introduces its own scalable networking hardware 6 pack

ఫేస్‌బుక్ సిక్స్ ప్యాక్

  ఫేస్‌బుక్ సంస్థ ‘సిక్స్ ప్యాక్’ పేరుతో కొత్త హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ ‘సిక్స్ ప్యాక్’ ద్వారా ఫేస్‌‌బుక్ యాప్స్, ఫేస్‌‌బుక్ సేవలు మరింత మెరుగ్గా వినియోగదారులకు అందనున్నాయి. ఇది ఒక స్విచ్‌లా పనిచేస్తుంది. ఇది చాలా చిన్న పరికరం. దీని ద్వారా ఫేస్‌‌బుక్ భారీ నెట్‌వర్క్‌లను కూడా నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. నెట్‌వర్కింగ్ పరికరాలను తయారు చేయడంలో ఇప్పటి వరకూ సిస్కో కంపెనీ ఆధిపత్యం హార్డ్ వేర్ రంగంలో కొనసాగుతోంది. ఆ సంస్థ కంటే ధీటుగా ఫేస్‌బుక్ సొంతగా ఈ ‘సిక్స్ ప్యాక్’ను తయారు చేసుకోవడం విశేషం. జూన్ నుంచి అందుబాటులోకి రానున్న ఈ చిన్న పరికరం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హై కెపాసిటీ స్పైస్ స్విచ్‌ల కంటే బాగా పనిచేస్తుందని ఫేస్‌‌బుక్ వర్గాలు చెబుతున్నాయి.

Futuristic Japanese hotel will be run almost entirely by robots

రోబోలు స్టాఫ్‌గా జపాన్ హోటల్

  ఏది ఏమైనా జపాన్ వాడి బుర్రేబుర్ర. సాంకేతికంగా ఏ విప్లవం తేవాలన్న జపాన్ వాడి తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా రోబోలను అడ్డదిడ్డంగా వాడుకోవడంలో జపాన్ వాడి తెలివితేటలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. జపాన్ రోబో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఒక కొత్త పుంతను తొక్కింది. అది స్టాఫ్ అంతా రోబోలతో ఒక హోటల్ నిర్మాణం. అప్పుడెప్పుడో ఆటంబాబు పడి సర్వనాశనం అయిపోయిన నాగసాకి నగరం ఆ తర్వాత అభివృద్ధి పథంలోకి పయనించి ప్రపంచమంతా ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ఇప్పుడు ఈ నగరంలోనే ఆ అత్యాధునిక హోటల్ని ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో స్టాఫ్‌గా మనుషులెవరూ ఉండరు. అన్నీ రోబోలే. 72 రూములతో అత్యధునాతనంగా నిర్మించిన ఈ హోటల్ని ఈ ఏడాది జూలై నెలలో ప్రారంభించబోతున్నారు. హోటల్‌కి వెళ్ళిన కస్టమర్ల లగేజీని తీసుకోవడం, రిసెప్షనిస్టు, రూమ్ సర్వీస్... ఇలా అన్ని విషయాల్లోనూ రోబోలే పనిచేస్తాయి.

3D printed heart helps to save girl life

పసి ప్రాణాన్ని కాపాడిన 3డి ప్రింటర్

  ఈమధ్యే మొదలైన 3డి ప్రింటర్ల విప్లవం సంచలనాలను సృష్టిస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఇప్పుడు 3డి ప్రింటర్ ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. అమెరికాకి చెందిన ఓ చిన్నారికి రెండేళ్ళ వయసు వచ్చేసరికి ఆమె గుండెలో వున్న పెద్ద లోపం బయటపడింది. గుండెకు వుండే రెండు కవాటాల మధ్య చాలా లోపాలు వున్నాయి. ఆ లోపాలతో ఆ చిన్నారి ప్రాణాపాయంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గుండె రెండు కవాటాల మధ్య అమర్చడానికి అవసరమైన గుండెలోని ఆ ప్రదేశం నమూనాను డాక్టర్లు 3డి ప్రింటర్‌కి అందించారు. అంతే 3డి ప్రింటర్ ఎంచక్కా పాప గుండె లోపలి భాగాన్ని ప్రింట్ చేసి ఇచ్చేసింది. గుండెలోని ఆ భాగాన్ని ఆ పాపకు ఆపరేషన్‌ చేసి అమర్చడంతో ఆమెకు కొత్త జీవితం లభించింది. ఈ ఘనత తమది కాదని... 3డి ప్రింటింగ్ టెక్నాలజీదేనని డాక్టర్లు కూడా అంటున్నారు. ముందు ముందు 3డి ప్రింటింగ్ ఇంకెన్ని అద్భుతాలను సృష్టిస్తుందో మరి...

angry bird games

హాలీవుడ్ కంటే యాప్స్ మార్కెట్టే ఎక్కువ...

  సినిమా రంగంలో హాలీవుడ్‌ది అగ్రపీఠం. హాలీవుడ్‌లో రూపొందే భారీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్లను కొల్లగొడుతూ వుంటాయి. సినిమాలది పెద్ద తెర.. కలెక్షన్లు కూడా ఆ స్థాయిలోనే భారీగా వుంటాయి. మరి యాప్స్ విషయం.. చిన్న కంప్యూటర్ల తెరల మీద, అంతకంటే చిన్నవైన సెల్ ఫోన్ తెరల మీద కనిపిస్తూ వుంటాయి. సాధారణంగా అయితే హాలీవుడ్‌తో యాప్స్‌ని పోల్చడానికి ఎవరూ ఇష్టపడరు. హాలీవుడ్ కంటే యాప్స్ స్థాయి చాలా చిన్నదని అనుకుంటారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వున్నాయి. 2014 సంవత్సరంలో హాలీవుడ్ సాధించిన మార్కెట్ వాల్యూ కంటే యాప్స్ సాధించిన మార్కెట్ వాల్యూనే ఎక్కువగా వుంది. హాలీవుడ్ కంటే యాప్స్ 10 బిలయన్ డాలర్ల ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి సంచలనం సృష్టించింది. యాంగ్రీ బర్డ్ లాంటి గేమ్స్, ఫేస్‌బుక్ మొబైల్ వెర్షన్లు కొన్ని హాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ డబ్బును సంపాదించాయి.

Google Chairman Eric Schmidt The Internet Will Disappear

కొంతకాలానికి ఇంటర్నెట్ మాయం

  కొంతకాలం తర్వాత ఇంటర్నెట్ మాయమైపోతుందట. ఈ మాట అన్నది ఎవరో అల్లాటప్పా వ్యక్తి కాదు. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఛైర్మన్ ఎరిన్ స్మిమ్‌డట్. ఇక అంతటి వ్యక్తి చెప్పిన తర్వాత ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గా పరిగణించాల్సిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఎరిన్ స్మిమ్‌డట్ పాల్గొని మాట్లాడుతూ పైన పేర్కొన్న సంచలన వ్యాఖ్య చేశారు. ఇప్పటికే మనం ఎన్నో ఐపీ అడ్రస్‌లు, ఇతర పరికరాలు, సెన్సర్లను మనం వినియోగిస్తున్నాం. భవిష్యత్తులో మనకు తెలియకుండానే మన ప్రైవసీ సమాచారం మొత్తం నిఘా ద్వారా ఇతరులకు వెళ్ళిపోతుందని ఆయన చెప్పారు. అప్పుడు జనం ఇంటర్నెట్ వాడాలంటేనే భయపడి దానికి దూరమైపోతారని ఆయన తెలిపారు. అలా ఇంటర్నెట్ అదృశ్యమైపోతుందని ఆయన వివరించారు. బాబోయ్.. అదే జరిగితే ఇంకేమన్నా వుందా? ఆయన ‘కొంతకాలం తర్వాత’ అన్నారు.. ఆ కొంతకాలం ఏ వందేళ్లో అయితే బావుండు.. మన జనరేషన్‌కి ప్రాబ్లం వుండదు..

Microsoft to give away Windows 10 unveils hologram glasses

విండోస్ 10 విశేషాలు

మైక్రోసాఫ్ట్ విండోస్ 8.1 తర్వాత వెర్షన్ విండోస్ 9 అవుతుందని అందరూ అనుకున్నారు.  అయితే మైక్రోసాఫ్ట్ విండోస్ 10 వెర్షన్‌ని ప్రకటించి అందరికీ ఆశ్చర్య చకితులను చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ త్వరలో అందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో విండోస్ 10 ప్రివ్యూను మైక్రోసాఫ్ట్ సంస్థ బుధవారం నాడు ప్రకటించింది. ఈ విండోస్ 10 విశేషాలు ఇలా వున్నాయి. *  విండోస్ 10 అన్ని డివైస్‌లకు ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడుతుంది. * విండోస్ 10 కోసం రూపొందించిన యాప్స్ డెస్క్‌టాప్, ఫోన్, ఎక్స్‌బాక్స్ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల పైనా పనిచేస్తాయి. * విండోస్ 8 వర్షన్‌లో కోల్పొయిన స్మార్ట్ మెనూను విండోస్ 10 వర్షన్‌లో మైక్రోసాఫ్ట్ తిరిగి ప్రవేశపెట్టింది. * విండోస్ 10లో స్పార్టాన్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. తక్కువ స్పేస్‌‌ను మాత్రమే ఆక్రమించే స్పార్టాన్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ తరహాలో వేగవంతంగా స్పందించగలదు.   * విండోస్ 10 ఓఎస్ మొబైల్ వర్షన్ ఫిబ్రవరి నుంచి అందుబాటులో వుండనుంది. * విండోస్ 10 అన్ని ఫోన్‌లలోనూ ఒక సంవత్సరం పాటు ఉచితంగా రన్ అవుతుంది. * విండోస్ 10లోని కార్టోనా కార్టోనా వాయిస్ అసెస్టెంట్ ఫీచర్‌ మనం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంది. * స్పార్టాన్ స్పార్టాన్ బ్రౌజర్‌వేగవంతమైన బ్రౌజింగ్‌ను చేయగలదు. * ఎక్స్‌బాక్స్ గేమింగ్ డివైస్‌‌ను సునాయాసంగా తమ డివైస్‌లలో రన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన యాప్‌‌ ఇందులో వుంది.

How Download Whatsapp on your PC Desktop for Android Apple users

ఇక కంప్యూటర్లలో వాట్స్‌యాప్

  ఇప్పటి వరకూ సెల్‌ఫోన్లలో హవా నడిపిస్తున్న వాట్స్ అప్ ఇక ముందు డెస్క్ టాప్స్‌లో కూడా టాప్ లేపనుంది. వాట్స్ యాప్ డెస్క్ టాప్ వెర్షన్ విడుదలైంది. ఇప్పుడు ఫోన్ల ద్వారా మాత్రమే కాకుండా డెస్క్ టాప్ ద్వారా కూడా వాట్స్ యాప్ మెసేజ్‌లు పంపుకోవచ్చు. కొంతమంది ఫోన్ల ద్వారా వాట్స్ యాప్ మెసేజ్‌లు పంపాలంటే టైపింగ్ సరిగా చేయలేక ఇబ్బంది పడుతూవుంటారు. ఇప్పుడు వాళ్ళు డెస్క్ టాప్ ద్వారా ఎంచక్కా టైపింగ్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ దగ్గర కూర్చున్న సమయంలో ఫోన్ మీద ఒక లుక్కేసి వుండాల్సిన అవసరం లేదు. డెస్క్ టాప్ మీదకు కూడా వాట్స్ యాప్ మెసేజ్‌లు వచ్చేస్తాయి. ఇంకేం.. వాట్స్ యాప్ డెస్క్ టాప్ వెర్షన్‌ని డౌన్ లోడ్ చేసుకోండి.

The Pebble Steel is a Really Stylish Smart watch

మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ వాచ్

  ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌లో స్మార్ట్ యుగం నడుస్తోంది. సెల్ ఫోన్ రంగాన్ని స్మార్ట్ ఫోన్లు ఏలుతుంటే, మరోవైపు స్మార్ట్ వాచ్‌లు ఆ రంగంలో తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. స్మార్ట్ వాచ్‌ల రంగంలో అగ్రస్థానంలో వున్న పెబుల్ సంస్థ ఇప్పుడు తన సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి కేవలం అందమైన వాచ్‌ల్లా మాత్రమే కాదు.. స్మార్ట్ ఫోన్లలా, ఐ ఫోన్‌లా కూడా ఉపయోగపడుతుంది. మీ ఫోన్‌కి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మీ వాచ్‌కి కూడా వచ్చే ఏర్పాటు వుంది. అంతేకాదు.. ఈ వాచ్‌ లుక్‌ని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త వాచ్ పెట్టుకున్న అనుభూతిని పొందొచ్చు. ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతలున్న ఈ వాచ్‌ ఖరీదు అమెరికా మార్కెట్లో 249 డాలర్లు.

Lenovo Tab 2 A7 10 With Android 4 4 KitKat Launched at Rs 4999

ఐదువేలకే అదిరిపోయే ట్యాబ్

  ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఎప్పటికప్పుడు నేలమీదకి దిగి వస్తూ వుంటాయి. ముఖ్యంగా ఈమధ్య కాలంలో సెల్‌ఫోన్లు, ట్యాబ్స్ ధరలు దిగి వస్తున్నాయి. తాజాగా ట్యాబ్‌ల తయారీ రంగంలో ముందడుగులో వున్న లెనోవో సంస్థ ఒక కొత్త ట్యాబ్‌ని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. ఈ ట్యాబ్ ఖరీదు ఎంతో తెలుసా? కేవలం ఐదు వేల రూపాయలే! నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. నిజంగానే ఐదు వేల రూపాయలే..! ఈ ధరలో ట్యాబ్‌ 2 ఎ7-10ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌‌ ద్వారా లభిస్తుంది. స్నాప్‌డీల్‌ వెబ్‌సైట్‌పై ఈ ట్యాబ్‌ లభిస్తుందని లెవోనో ప్రకటించింది. ఈ ట్యాబ్‌ని ఇటీవల లాస్‌వెగాస్‌లో జరిగిన కన్సూ మర్‌ ఎలక్ట్రానిక్‌ షోలో లెనోవో సంస్థ ప్రదర్శించింది. ఈ ట్యాబ్‌లో మల్టీమీడియా ఫీచర్స్‌ వున్న ఈ ట్యాబ్ బరువు 269 గ్రాములు. ఏడంగుళాల డిస్‌ప్లేతోపాటు 4.4 కిట్‌క్యాట్‌ ఆండ్రాయిడ్‌ వ్యవస్థ, 1.3జిహెచ్‌డ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ వస్తోంది. లెనోవో డూ ఇట్‌ యాప్స్‌, డాల్బీ ఆడియో వ్యవస్థ కూడా వున్నాయి. 1 జీబీ రామ్‌, 8 జీబీ అంతర్గత మెమరీ, వైఫై, బ్లూటూత్‌, 0.3ఫిక్సెడ్‌ ఫోకస్‌కెమేరా, 3450 ఎంఎహెచ్‌ లి-ఇయాన్‌ బ్యాటరీతో వస్తోంది.

Samsung Z1 Tizen based smartphone goes official

మార్కెట్లోకి శామ్‌సంగ్ జడ్1 ఫోన్... విశేషాలు

  సెల్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం లాంటి సంస్థ శామ్‌సంగ్ మరో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగించారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని శామ్‌సంగ్ సంస్థ సగర్వంగా ప్రకటించింది. ఈ ఫోన్ బుధవారం నాడు మార్కెట్లోకి విడుదలైంది. అన్నిటికంటే అనుకూలమైన అంశం ఏమిటంటే.. ఇది సామాన్యులకు అందుబాటులో వుంది. దీని ధర కేవలం 5 వేల 700 రూపాయలే. ఈ ఫోన్ వైట్, బ్లాక్, వైన్ రెడ్ రంగుల్లో లభిస్తుంది. 768 రామ్ వున్న ఈ ఫోన్‌లో 4 జీబీ ఇంటర్నల్ మెమరీ కూడా వుంది. యాంటీ వైరస్‌ కూడా ఇన్‌బిల్ట్‌గా వుంటుందని తెలుస్తోంది.

అమ్మాయి కాదు.. రోబో...

  జపనీయులు ఎప్పటికప్పుడు కొత్త తరహా రోబోలను రూపొందించడంలో బిజీగా వుంటారు. తాజాగా జపాన్‌కి చెందిన తోషిబా ఒక అందమైన అమ్మాయి ఆకారంలో ఒక రోబోను రూపొందించింది. ఈ రోబో పేరు చిహిరా ఐకో. సడెన్‌గా చూస్తే నిజమైన అమ్మాయిలా, జపాన్ సంప్రాదాయ బద్ధంగా కనిపించే చక్కని ఆడపిల్లాలా అనిపించే ఈ రోబో మనిషిలా చేతులు కదిలిస్తూ చక్కగా మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది. సందర్భానికి తగినట్టుగా ఎక్స్‌ప్రషన్లు కూడా ఇస్తుంది. ఈ రోబోకి ఫ్రంట్ ఆఫీసులో రిసెప్షనిస్టుగా కూర్చోబెట్టడానికి అన్ని అర్హతలూ వున్నాయట. టీవీల్లో వార్తలు చదవడానికి కూడా భేషుగ్గా పనికొస్తుందట. ఈ రోబోను భవిష్యత్తులో మరింత డెవలప్‌ చేసి హోటళ్ళలో వెయిట్రెస్‌గా, హాస్పిటళ్ళలో నర్సులాగా కూడా పని చేసేలా చేస్తారట.

వారెవ్వా ఏమి ట్యాబ్లెట్

  ట్యాబ్లెట్ ఎంత తేలిగ్గా వుంటే దాన్ని ఉపయోగించే వాళ్ళకి అంత సౌకర్యంగా వుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన అనేక కంపెనీలు తాము ఉత్పత్తి చేసే ట్యాబ్లెట్ల బరువును క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో ముందుండే డెల్ సంస్థ తాజాగా అత్యంత పల్చగా వుండే ట్యాబ్లెట్‌ని తయారు చేసింది. వెన్యూ 8 పేరుతో రూపొందించిన ఈ టాబ్లెట్ ఈమధ్యే మార్కెట్లోకి కూడా విడుదలైంది. ప్రస్తుతం అమెరికాలో దొరుకుతోంది. తెలిసినవారి చేత తెప్పించుకోవాలంటే దాదాపు పాతికవేల రూపాయల ధరకు లభిస్తుంది. ఇంటెల్ సహకారంతో నిర్మించిన ఈ గాడ్జెట్‌లో ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. డెస్క్‌టాప్ పీసీ సామర్థ్యానికి సమీపంలో ఇది ఉంటుంది. దీంతోపాటు పవర్ వీఆర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, రెండు గిగాబైట్ల ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులువు అవుతుంది. గ్రాఫిక్స్ మోతాదు ఎక్కువగా ఉండే గేమ్స్‌ను ఈ ట్యాబ్లెట్లో హాయిగా అడుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఎనిమిది మెగాపిక్సెళ్ల కెమెరా నిక్షిప్తమై వుంది. డెల్ వెన్యూ 8లో 16 జీబీల బిల్ట్ ఇన్ స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్‌డీకార్డు ద్వారా దీన్ని మనకు కావలసినంత స్థాయికి పెంచుకోవచ్చు కూడా. స్క్రీన్‌సైజు 8.4 అంగుళాలు కాగా, రెజల్యూషన్ 2560 / 1480 వరకూ ఉంటుంది. దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు. ఇంకేం.. అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా.. వెంటనే తెప్పించుకోండి.. ఇండియాకి ఇది ఎప్పటికి వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదుమరి.

SALE AND REVIEW OF XIOAMI- MI3

Check our brief review of this phone about features what we liked and what we didn’t You can’t expect more for 14 K Mobile it gives toughest competition for Nexus 5, Galaxy S4, Xperia Z at nearly half the price                                                                                                                                       let’s take a look at the  key specifications Key Specifications Operating system: Android v4.4.2 Camera: 13MP Rear camera & 2 MP Secondary Camera     Full HD Recording Processor:   2.3 GHz Qualcomm Snapdragon 800 8974 AB Quad Core ROM & RAM: 16 GB& 2 GB Display: Full HD 5 inch IPS Display   Flip kart is ready to sell another 20,000 Handsets of Xioami MI3 tomorrow afternoon i.e. 26th August 2014 at 2 PM. Flip kart claims that over 1 lakh registrations were received however the registrations were open till Monday midnight. Flip kart even announced the accessories of MI3 which were available on pre-orders which includes flip cover, screen guardWe are assuming that flip kart and xiaomi will rewrite their own record of their first three sales. There first sale for this mobile went on July 22nd and this sale drove heavy traffic and it crashed Indian E-commerce giant,second sale happened on July 29th  and all  the mobile were sold in 5 seconds  third, fourth and fifth sales happened in a flash merely 2 – 2.4 seconds now we are expecting the same for tomorrow   Our rating for this mobile is 3.5/5 (Best at price)