కడపలో షర్మిలని గెలిపించండి: విజయమ్మ పిలుపు

కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి విజయమ్మ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆమె అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను మీ విజయమ్మను. రాజశేఖరరెడ్డిని అభిమానించేవారికి, రాజశేఖరరెడ్డిని ప్రేమించే వారికి, యావత్ కడప లోక్‌సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. రాజశేఖరరెడ్డిని మీరు ఏ రకంగా అభిమానించారో, ఏ విధంగా అక్కున చేర్చుకున్నారో, ఏ విధంగా నిలబెట్టుకున్నారో.. ఆయనకు ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవలో మీకే అంకితం అయ్యారు. మీకు సేవ చేస్తూనే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంటుకు కంటెస్ట్ చేస్తా వుంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకు పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వమని మిమ్మల్నందర్నీ ప్రార్థిస్తున్నాను’’ అని ఆ వీడియోలో విజయమ్మ చెప్పారు. ఇది నిజంగానే ఏపీ రాజకీయాలలో ఒక సంచలనమైన విషయం, నువ్వు ఇస్తే నాకు మద్దతు ఇవ్వాలి, లేకపోతే షర్మిలకు మాత్రం ఇవ్వకూడదు అని జగన్ బెదిరించినప్పటికీ, అమెరికా వెళ్ళిపోయేలా చేసినప్పటికీ విజయమ్మ ఇలా కీలక సమయంలో షర్మిలకు ఓటు వేయాలని పిలుపు ఇవ్వడం జగన్‌కి పెద్ద షాకే. ఇప్పటికే ఎన్నో చిక్కుల్లో వున్న జగన్ మీద ఇప్పుడు విజయమ్మ రూపంలో మరో చిక్కు వచ్చి పడింది.

తెలుగు రాష్ట్రాల వోటర్లకు జెపి సూచన 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ గత మార్చి నెలలో మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని  ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని వివరించారు. వైసీపీ  వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు విడుదల చేసిన ప్రకటనలో జెపి వివరణ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు వోటర్లకు డబ్బులు పంచుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.    ‘ఓటు అనేది ఆ రోజు కలిగే ఆవేశంతోనో, ఆ పూట కలిగే కోపంతోనో, నేతలు ఇచ్చిన డబ్బు కోసమో, రేపు ఎవరో ఏదో ఇస్తారనే ఆశతోనో, మద్యం మత్తులోనో వేసేది కాదు. కొద్దిగా రేపేం జరగబోతోందో ఆలోచించి, జాగ్రత్తగా ఓటు వేయండి అని తెలుగు రాష్ట్రాల ఓటర్లకు సూచించారు.

మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా.. వైరల్ అవుతున్న చంద్రబాబు పాత వీడియో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం (మే13)న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల కిందటి వరకూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరు. ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాలుగైదు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్న భావన గట్టిగానే వ్యక్తమయ్యేది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల వార్ వన్ సైడేనని సామాన్య జనం కూడా అంటున్నారు. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఉందని చెబుతున్నారు. నమ్ముతున్నారు.  తాజాగా పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు, టీచర్లు ఉపయోగించుకున్న విధానం జగన్ సర్కార్ పై వారికి ఉన్న కసి, ఆగ్రహాన్ని ప్రస్ఫుటం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనబాహుల్యంలో కూడా జగన్ సర్కార్ పట్ల అదే ఆగ్రహం, అదే కసి, అదే పట్టుదల కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా కూటమి సభలకు వెల్లువెత్తుతున్న జనసందోహాన్ని చూపుతున్నారు. మరో వైపు జగన్ సభలు వినా వైసీపీ చెప్పుకోదగ్గ ఒక్క భారీ బహిరంగ సభా నిర్వహించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక పార్టీ అధినేతగా జగన్ కూడా రాష్ట్రం మొత్తం చుట్టేయలేదు. అన్ని నియోజకవర్గాలనూ కవర్ చేయలేదు. ఏదో ప్రచారం నిర్వహించామన్నట్లుగానే ఆయన మనమంతా సిద్ధం సిద్ధం పర్యటనలు ఉన్నయని చెబుతున్నారు.  ఇక మరో వైపు దేశ విదేశాల నుంచి ఆంధ్రులు పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుని రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలన్న పట్లుదల వారిలో కనిపిస్తోంది. సరిగ్గా రెండు రోజుల కిందట ఉద్యోగులు ఎలాంటి పట్టుదలతో సంకల్పంతో పోస్టల్ బ్యాలెట్  ద్వారా  ఓటు వేశారో సరిగ్గా అలాంటి పట్టుదల, సంకల్పం సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న ఆంధ్రులలో కనిపిస్తోంది.  సర్వత్రా తెలుగుదేశం విజయభేరి మోగించడం ఖాయమన్న భావన వ్యక్తమౌతున్న వేళ.. తెలుగుదేశం శ్రేణులు, అభిమానులలలో మరింత జోష్ నింపే విధంగా ఒక పాత వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.  ఆ వీడియో  2021 నవంబర్ 21న అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం. నాడు నిండు అసెంబ్లీలో  చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వైసీపీ దుర్భాషలాడారు. చంద్రబాబును అవమానించారు. కనీసం మైక్ కూడా ఇవ్వకుండా వేధించారు. దాంతో ఆయన అప్పుడు నిండు అసెంబ్లీలో  తాను మళ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ ప్రతిజ్ణ చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని విమర్శించి తాను మళ్లీ గౌరవ సభలో అదీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని ప్రకటించి అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.   నాడు చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్నీ, ప్రతిజ్ణనూ అప్పడు తన మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డు చేసిన ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే ఆ వీడియో వెంటనే వైరల్ అయిపోయింది. తెలుగుదేశం కేడర్ ను, మద్దతు దారులను ఉత్తేజితులను చేస్తోంది.  ఎలాగైనా జగన్ ను ఓడించి, వైసీపీని గద్దెదించాలన్న వారి పట్టుదలను ద్విగుణీకృతం చేస్తోంది.   2012లో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి  జయ లలితను అప్పడి డీఎంకే ప్రభుత్వం నిండు సభలో అవమానించిన తరువాత ఆమె కూడా తాను మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. అన్నట్లుగానే ఆ తరువాత జరిగిన ఎన్నికలలో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. జయలలిత సీఎంగా సభలో అడుగు పెట్టారు. ఆ విధంగా చంద్రబాబు కూడా తన ప్రతిజ్ణ నెరవేర్చుకుంటారనీ, మే 13న జరిగే ఎన్నికలలో ఘన విజయం సాధించి సీఎంగానే ఏపీ అసెంబ్లీలో అడుగుపెడతారని తెలుగుదేశం శ్రేణలు ధీమాగా ఉన్నాయి.  

డైమండ్ రాణి సందడి ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్-3’

తెలుగువన్ అందించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ పొలిటికల్ స్పూఫ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వుంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు ఎపిసోడ్స్ ప్రేక్షకులను నవ్వుల వరదలో ముంచెత్తడంతోపాటు ఆలోచింపజేస్తున్నాయి. గగన్ అనే దుర్మార్గపు పాలకుడి ప్రజా వ్యతిరేక విధానాలను హాస్యభరితంగా చూపించే ప్రయత్నం చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ ప్రేక్షకాదరణ పొందుతోంది.  కాగా, ఈ సిరీస్లో మూడో ఎపిసోడ్ శనివారం నాడు రిలీజ్ అయింది. మొదటి, రెండవ ఎపిసోడ్స్.లో మెరుపులా మెరిసిన డైమండ్ రాణి, ఈ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో తన ‘టాలెంట్’ ప్రదర్శించింది. ఈ ఎపిసోడ్ కూడా ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ రేంజ్‌ని పెంచేలా వుంది.   

గుట్కా నానికి కొత్త పిచ్చి పట్టింది!

బూతుల ఫ్యాక్టరీ, గుట్కా బస్తా అని గిట్టనివారు పిలుచుకునే కొడాలి నానికి ఇప్పుడు కొత్త పిచ్చి పట్టింది. కొడాలి నాని నోరు తెరిస్తే గుట్కా కంపు ముందు వస్తుందో, బూతుమాట ముందు వస్తుందో నిజానికి ఆయనకి కూడా తెలియదు. మొన్నటి వరకూ బూతే భవిష్యత్తు అన్నట్టుగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్త పిచ్చి ఎక్కించుకుని ఆరకంగా ముందుకు వెళ్తున్నారు. తాను కన్ఫమ్‌గా గెలవనని తెలిసినా, దింపుడుకళ్ళం ఆశతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నాని, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ప్రచారంలో వింత పోకడలు పోతున్నారు. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడకి వెళ్ళినా లోకల్ కార్యకర్తలు పూల మీద నడిచే ఏర్పాటు కంపల్సరీ చేయాలట. అలాగే గజమాల కంపల్సరీ. చేతులకు దారాలు, మెడలో రుద్రాక్షలు ఎలాగూ వుంటాయి కాబట్టి, ఇప్పుడు అడిషనల్‌గా పాదపూజల సిస్టమ్ కూడా ప్రారంభమైంది. ప్రతిరో్జూ ఎవరో ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కార్యకర్త చేత కొడాలి నానికి పాదపూజ చేయించడం ప్రతిరోజూ కామన్.  దీన్నే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారని స్థానికులు అనుకుంటున్నారు. 

జగన్ జావగారి పోయారు.. చేతులెత్తేశారు!

సింహం సింగిల్ గానే వస్తుంది. ఎంత మంది కలిసినా వా వెంట్రుక కూడా పీకలేరు. వైనాట్ 175, అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలకు సంకేమం సొమ్ములు క్రమం తప్పకుండా బటన్ నొక్కి పంచాను. వాళ్లంతా నాకే ఓటేస్తారు. ఇవీ జగన్ నిన్నమొన్నటి దాకా గంభీరంగా చెప్పిన మాటలు. మరి ఆ ధైర్యం, స్థైర్యం ఏమైపోయాయో.. ఇప్పుడు బేలగా, దీనంగా మాట్లాడుతున్నారు. అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలకు మేళ్లు చేశానని సగర్వంగా చెప్పుకునే వైసీపీ అధినేత  జగన్  ఇప్పుడు జనం ముందుకు వచ్చి అందరూ కలిసి కుట్ర చేసి నన్ను ఓడించడానికి చూస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. కన్నీళ్లోక్కటే తక్కువ అన్నట్లుగా వేడుకుంటున్నారు. మూడు నెలల కిందటి వరకూ  తెలుగుదేశం, జనసేన కలిసి వచ్చినా తనను కదిలించలేరనీ, ఆ పార్టీల అధినేతల ప్రజా విశ్వాసం కోల్పోయారనీ, తననేం పీకలేరని అన్న జగన్ ఇప్పుడు అదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను చూసి, వారి ప్రచారానికి వస్తున్న జనస్పందనను చూసి వణికిపోతున్నారు.   గతంలో తెలుగుదేశం  అధినేత చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక సభలో మాట్లాడుతూ  వైనాట్ కుప్పం? అని  సవాల్ చేసిన జగన్  ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పులివెందులలో, సొంత జిల్లా కడపలో గట్టెక్కుతానా అన్న భయంతో గజగజలాడుతున్నారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ సమయంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారంటే చేతులెత్తేయడం కాక ఇంకేమిటనాలి.      అన్నిటికీ మించి   ప్రజలు తనను మాత్రమే నమ్ముతున్నారన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ ఇప్పుడు ప్రజలను నన్ను ఇంకొక్కసారి నమ్మండి ప్లీజ్ అని బతిమలాడుకుంటున్నారు.  జగన్ ఇంతగా జావగారిపోవడం.. ఆ పార్టీలో గెలుపు ఆశలు ఉన్న కొద్ది మంది అభ్యర్థుల అవకాశాలను కూడా నీరుగార్చేస్తోంది. అధినేతే కాడి పారేసి, ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ప్రచార సభలలో మాట్లాడుతుంటే.. క్యాడర్  ఎలాగా ఓడిపోయే పార్టీకి ప్రచారం కూడా ఎందుకని సభలకు మొహం చాటే స్తున్నారు. అంతే కాదు అభ్యర్థులు కూడా అధికారం అందదని పార్టీ అధినేతే చెప్పేస్తుంటే.. ఇంతోటి దానికి ప్రచారం కోసం డబ్బులు తగలెయ్యడం దేనికన్న భావనకు వచ్చి ప్రచారాన్ని పరిమితం చేసేశారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూటమి సభల హవాయే కనిపిస్తోంది తప్ప వైసీపీ ప్రచార హోరు వినిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీ అభ్యర్ధులు డబ్బులు ఖర్చు పెట్టడం లేదంటూ.. పలు జిల్లాల నుంచి పార్టీ అధిష్ఠానానికి అందుతున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.  

వల్లభనేని వంశీకి చంద్రబాబు ఇచ్చిన బిరుదేంటో తెలుసా?

వల్లభనేని వంశీ.. ఇటీవలి కాలంలో  ప్రజలలో బాగా నానుతున్న పేరు. అదేదో ఆయన గొప్ప పనులు చేసేశారని కానీ, సమాజ సేవలో మునిగి తేలుతున్నరాన్న ప్రశంసలతో కానీ కాదు. అడ్డగోలు రాజకీయం, తిన్న ఇంటి వాసాలనే లెక్కపెట్టే నైజంపై వెల్లువెత్తుతున్న విమర్శల కాలంగా ఇటీవలి కాలంలో ఆయన పేరు ప్రజలలో బాగా చర్చకు వచ్చింది. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశి ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆయన రెండో ఆలోచన లేకుండా ఆ పార్టీలోకి దూకేశారు. అలా దూకేసి ఊరుకోలేదు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపై అవాకులూ చవాకులూ పేలారు. తెలుగుదేశం అధినేతపై, ఆయన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి జడిసి ఆ తరువాత బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పినా, వల్లభనేని వంశీ పట్ల జనాగ్రహం తగ్గలేదు. అది ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. సొమ్ములు తీసుకునీ, పోయించిన మద్యం తాగి వచ్చిన వారు కూడా మధ్యలోనే ఉడాయించారు. అప్పటికి తత్వం బోధపడిన వంశీ ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించి ఆకులు పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా జనం నమ్మలేదు. ఎందుకంటే వైసీపీ గూటికి చేరి, తెలుగుదేశం నాయకులు, క్యాడర్ పై ఆయన చేసిన  దాష్టికాలు, దౌర్జన్యాలు, అనుచిత వ్యాఖ్యలకు తోడు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సాగించిన గూండాగిరీని గన్నవరం ప్రజలు మరిచిపోవడానికి రెడీగా లేరు. అటువంటి వల్లభనేని వంశీకి చంద్రబాబు ఓ బిరుదు ఇచ్చారు. ఆయన ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను సైకోకా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు గన్నవరంలో  ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ వల్లభనేని వంశీని పిల్ల సైకోగా అభివ ర్ణించారు. అటువంటి గూండాలను అణచివేస్తానని స్పష్టంగా చెప్పారు.  భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు గన్నవరం ర్యాలీలో పాల్గొనడం ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అద్దం పడితే.. అంతటి భారీ వర్షంలోనూ పెద్ద సంఖ్యలో జనం చంద్రబాబు ప్రసంగం వినడానికి తడిసిముద్దౌతూ కూడా కదలకుండా నిలబడి ఉండటం జనంలో ఆయన పట్ల ఉన్న నమ్మకానికీ విశ్వసనీయతకూ తార్కానంగా నిలుస్తుంది.  

జడ్జి ఇంటిపై దాడి... పేట్రేగిపోతున్న పెద్దిరెడ్డి గ్యాంగ్

ఏప్రిల్ 30వ తేదీ, 2024 సంవత్సరం. అది అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ నివాసం. సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు అవుతోంది. అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు రామకృష్ణ ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ చేతిలో వేటకొడవళ్ళు వున్నాయి. రాళ్ళతో, వేట కొడవళ్ళతో  ఆ దుండగులు కిటికీల అద్దాలు పగలగొట్టారు. వరండాలో వున్న రామకృష్ణ కారును ధ్వంసం చేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో జడ్జి రామకృష్ణ కుటుంబం భయభ్రాంతులకు గురైంది. దాడి జరిగిన వెంటనే రామకృష్ణ 100 నంబర్‌కి ట్రై చేశారు. ఫోన్ కలవలేదు. రాత్రి పదిగంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో రామకృష్ణ బి.కొత్తకోట సి.ఐ.కి ఫోన్ చేశారు. తన ఇంటిపై జరిగిన దాడి గురించి చెప్పారు. వెంటనే స్పందించి పోలీసులను పంపించాల్సిన సీఐ సరిగా స్పందించలేదు. పోలీసులందరూ బందోబస్తులో వున్నారని అన్నారు. రామకృష్ణ మాట్లాడుతుండగానే సీఐ ఫోన్ కట్ చేశారు. రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో రామకృష్ణ మదనపల్లి డీఎస్పీకి ఫోన్ చేశారు. ఆయన సీఐ కంటే ఎక్కువ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కారణం లేకుండా ఎందుకు దాడి చేస్తారని అంటూ ఆయన కూడా ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో కొంతమంది పోలీసులు రామకృష్ణ ఇంటికి వచ్చారు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూశారు. కంప్లయింట్ రాసి ఇవ్వమని కోరారు. ఇంతలో వారికి సీఐ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళని వచ్చేయమని సీఐ ఆజ్ఞాపించారు. అప్పటి వరకు కంప్లయింట్ రాసి ఇవ్వమన్న పోలీసులు మేం ఇక్కడ కంప్లయింట్ తీసుకోం.. పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లయింట్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే అప్పుడున్న పరిస్థితిలో రామకృష్ణ ప్రమాదాన్ని శంకించి ఇంటి నుంచి బయటకి వెళ్ళలేదు.  మరుసటి రోజు ఉదయం రామకృష్ణ తన ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో ఈ ఉదంతం వైరల్ అయింది. దాంతో పోలీసులతో కలసి సీఐ  రామకృష్ణ ఇంటికి వచ్చారు. రిపోర్టు తీసుకున్నారు. ఇంట్లో వున్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. మర్నాడు ఈ ఉదంతంపై సీఐ స్టేట్‌మెంట్ న్యూస్ పేపర్లలో వచ్చింది. మాజీ జడ్జి రామకృష్ణకి, ఆయన సోదరుడు రామచంద్రకి మధ్య ఆస్తికి సంబంధించిన వివాదాలు వుండటం వల్ల రామచంద్ర దాడి చేశారని, రామచంద్ర ప్రస్తుతం తమ కస్టడీలో వున్నాడని సీఐ చెప్పిన్టటు పేపర్లలో వచ్చింది. అయితే తన పొలంలో పైపులు ఎవరో ధ్వంసం చేశారని తెలిసి తాను పొలానికి వెళ్తే అక్కడకి రామచంద్ర వచ్చి మరలా తనతో గొడవ పడ్డాడని రామకృష్ణ చెప్పారు. తనకు ఎంపీ, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సపోర్టు వుందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని, తనపై వున్న రౌడీషీట్ తీసివేస్తామని చెప్పారని తనతో వాదించాడని రామకృష్ణ తెలిపారు. రామచంద్ర పోలీస్ కస్టడీలో వున్నట్టయితే తన దగ్గరకి ఎలా వచ్చాడని ఆయన ప్రశ్నిస్తున్నారు. పొలం దగ్గరకి తన సోదరుడు రామచంద్రతో కలసి వచ్చిన మనోహర్ అనే వ్యక్తితో మాట్లాడినప్పుడు రామచంద్రతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు సాయిచరణ్, ఇంకా దాదాపు పదిహేను మంది ఒక బార్ అండ్ రెస్టారెంట్లో కలసి, మద్యం సేవించి, రామచంద్రకు డబ్బు ఇచ్చి, మిథున్ రెడ్డితో వీడియో కాల్‌లో మాట్లాడించి, మీ ఇంటి పైకి దాడికి పురిగొల్పారని, రామచంద్రతోపాటు గాండ్ల రమేష్, కొత్తపల్లి సుధాకర్‌రాజు, వేములేటికోట శశిరెడ్డి, ఓబెరెడ్డిగారిపల్లె వాసుదేవరెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి... ఇంకా గుర్తుతెలియని మరికొంతమంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పాడు. దీనిని నిర్ధారణ చేసుకోవడం కోసం రామకృష్ణ కర్నాటక బోర్డర్‌లో వున్న స్వర్గ బార్ అండ్ రెస్టారెంట్ యజమానిని సంప్రదించి, 30-04-2024 సాయంత్రం  6:45 నిమిషాల నుంచి రాత్రి 10:00 గంటల సమయం వరకు వున్న సీసీటీవీ ఫుటేజ్‌ సేకరించి, విశ్లేషణ చేయగా, పెద్దిరెడ్డి కుటుంబం చేసిన కుట్ర బహిర్గతమైంది. కానీ, పోలీసులు ఇది కుటుంబ కలహమంటూ, పెద్దిరెడ్డి చెప్పిన విధంగా నడుచుకుంటూ, అసలైన నేరస్థులను కేసు నుంచి తప్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  ఈ అంశాలన్నిటినీ కూడా జడ్జి రామకృష్ణ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి, జిల్లా పై అధికారులకు 03-05-2024న ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు. సహజంగా, ఇటువంటి దాడి జరిగినప్పుడు దాడి చేసిన వ్యక్తి కాల్ డేటాని పరిశీలించాలి, అతనితో ఎవరెవరు వున్నారన్న విచారణ జరపాలి. కానీ పోలీసులు ఇవేవీ జరపకుండా ఇది ఒక కుటుంబ తగాదా అని తేల్చేస్తున్నారని, సరైన విచారణ జరపకుండా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పినట్టుగా సీఐ వ్యవహరిస్తున్నారని రామకృష్ణ అంటున్నారు. తన ఇంటి మీద జరిగిన దాడి వెనుక వైసీపీ నాయకులు వున్నారని, వారందరినీ తప్పించడానికే తనపై జరిగిన ఈ ఘోరమైన, క్రూరమైన, దారుణమైన ఈ దాడిని ఒక కుటుంబ గొడవగా చిత్రీకరించడానికి, దాడికి పాల్పడిన వారిని కాపాడటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయంలో నిస్పాక్షిక విచారణ జరపాల్సిన బాధ్యత పోలీసుల మీద వుంది.

చత్తీస్ గడ్ లో  వరుస షాక్ లు ... మరో భారీ ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన 12 మంది మావోయిస్టులు 

ఛత్తీస్ గడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు నేలకొరిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారీగా ఆయుధాలను, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మృతి చెందిన వారిలో అగ్రనేతలు కూడా ఉన్నారని తెలిసింది. వరస దెబ్బలు... మావోయిస్టులకు ఇటీవల వరస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. పీడియా ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. వరస దెబ్బలు... మావోయిస్టులకు ఇటీవల వరస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. పీడియా ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్  జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. దీంతో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.  తాజాగా ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. స్థానికంగా గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.కాగా, ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విధితమే. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఏప్రిల్ 30న నారాయణ్ పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మరో ఎదురుకాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. గంగలూర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని పిడియా అడవిలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో దంతెవాడ, బీజాపుర్​ జిల్లాలోని సీఆర్​పీఎఫ్​, డీఆర్​జీ, ఎస్​టీఎఫ్ సంయుక్తంగా​ ఆపరేషన్​ను చేపట్టాయి. సుమారు 900 మందికిపైగా సైనికులు, మావోయిస్టులను చుట్టుముట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు లింగా, పాపారావు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్‌ 30న నారాయణ్‌పుర్‌, కాంకేర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 10 మంది మరణించారు. ఇలా ఇప్పటి వరకు బస్తర్​ ప్రాంతంలో జరిగిన వివిధ ఎన్​కౌంటర్లలో 103 మంది నక్సలైట్లు మరణించారు.

రేవంత్ జోలికెందుకు.. నీ కొంపలో కుంపటి ఆర్పుకో జగన్!

జగన్ ఎలా తయారయ్యాడంటే, తన విషయంలో ఏది జరిగినా దాని వెనుక వున్నది చంద్రబాబే. జగన్‌కి నరాల వీక్నెస్ వచ్చినా దానికి కారణం చంద్రబాబే. ఎంచక్కా బాబాయ్‌ని పైకి పంపేసి, ఆ నేరాన్ని చంద్రబాబు నెత్తిన వేశాడు. కోడికత్తి డ్రామా ఆడించి ఆ నేరాన్ని కూడా చంద్రబాబు అకౌంట్లోనే వేశాడు. ఈ రెండు దుర్మార్గాల కారణంగా గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన జగన్, ఈసారి ఎన్నికలలో కూడా ప్రతీదానికీ చంద్రబాబుని బాధ్యుడిని చేసి జనాన్ని మభ్యపడితే మరోసారి విజయం వరిస్తుందని భావిస్తున్నాడు. అందుకే గులకరాయి డ్రామా క్రియేట్ చేశాడు. ఆ డ్రామా కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినప్పటికీ వెనుకడుగు వేయని జగన్ ప్రతీదానికి చంద్రబాబునే దోషిగా చూపిస్తూ ఆత్మానందం పొందుతున్నాడు. తన సొంత చెల్లి షర్మిల, వివేకా కుటుంబ సభ్యులు జగన్‌కి వ్యతిరేకంగా రోడ్డెక్కడానికి కూడా చంద్రబాబే కారణమని అంటున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు కాబట్టి, అతని ద్వారా షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, ఆమె ద్వారా తనను చంద్రబాబు వేధిస్తున్నాడనేది జగన్ ఎప్పటి నుంచో చెప్తున్న వాదన. గత కొంతకాలంగా ఈ విషయంలో మౌనంగా వున్న రేవంత్ రెడ్డి ఇక ఊరుకుంటే లాభం లేదని రియాక్ట్ అయ్యారు. జగన్‌‌కి వాత పెట్టేలా మాట్లాడారు. నా జోలికి ఎందుకు వస్తావు.. ముందు నీ కొంపలో కుంపటి ఆర్పుకో అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధాలేవీ లేవని, ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నదే తన ధ్యేయమని రేవంత్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలను సొంత తల్లి, సొంత చెల్లే నమ్మడం లేదు.. జనం ఎందుకు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. కన్నతల్లి, సొంతచెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మొదట జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వాలని అన్నారు.

ఏపీ పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందో చెప్పేసిన పోస్టల్ బ్యాలెట్!

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు తేల్చి చెప్పేసింది. ఏపీలో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు మున్నెన్నడూ ఎరుగని విధంగా ఓ విధమైన కసితో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్న తీరు ప్రభుత్వంపై వారి వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. పోస్టల్ బ్యాలెట్ ను  ఉపయోగించుకుని ఓటేసి ఊరుకోలేదు. తాము ఓటు వేశామని చేతికి సిరా చుక్క గుర్తుతో ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి.. మిగిలిన వారిని కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. అందుకే గతంలో  ఈ సారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకుని ఓటు వేసిన వారి సంఖ్య గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉంటే వారిలో దాదాపు ఐదు లక్షల మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉన్నారు. అలా ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు.      గత ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య 2 లక్షల 38 వేల మంది అయితే.. ఈ సారి అలా ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ. రాష్ట్రంలోని పాతిక పార్లమెంటరీ నియోజకవర్గాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడిన ఓట్ల సంఖ్య 4లక్షల 44 వేల 216, అదే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు  4,44,218 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈ సంఖ్యే ప్రభుత్వంపై ప్రభుత్వోద్యోగులలో ఉన్న వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ప్రస్ఫుటంగా చూపుతోంది. ఒక వేళ ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్‌ ఇమేజ్‌ ఉంటే ఓటు వేయడానికి ఆసక్తి చూపించరు కానీ వ్యతిరేకత ఉంటేనే ఓటు రూపంలో చూపిస్తారు. అంతే కాకుండా మేధావులుగా, విద్యావంతులుగా ప్రభుత్వోద్యోగుల మొగ్గు ఒక్క వారికి సంబంధించినదే అయి ఉండదు. ఒపీనియన్ మేకర్స్ గా వారు సమాజంలోని  ఇతర వర్గాలను కూడా ప్రభావితం చేయగలరు. అందుకే పోస్టల్ బ్యాలెట్ ల ఫలితం వెలువడిన వెంటనే  ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అర్ధమైపోతుందని రాజకీయ పండితులు చెబుతుంటారు.    ఐదేళ్లుగా తమకు అన్యాయం చేస్తూ, వేధింపులకు, అవమానాలకు గురి చేసిన ప్రభుత్వంపై కసితోనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఈ నెల 13న జరగబోయే ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో కూడా చెప్పేసిందని అంటున్నారు.  

ఓటేస్తామంటే చాలు ప్రయాణం ఫ్రీ..

ఎన్నికల పండగ వచ్చింది.. హైదరాబాద్ ఖాళీ అవుతుంది..! ఎప్పుడూ పండగల సమయంలో ఖాళీ అయ్యే హైదరాబాద్ ఈసారి ఎన్నికల నేప‌థ్యంలో ఖాళీ అవుతోంది. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బస్సు టికెట్ల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలకు పెంచే దానికంటే అధికంగానే ఉన్నాయి టికెట్ ధరలు. ఒక్కో టికెట్ రెండు వేల రూపాయ‌ల నుంచి మూడు వేల రూపాయ‌ల ధ‌ర వ‌సూలు చేస్తున్నారు.  దీంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ప్రతి పార్టీ తమకు ఓటు వేసే వారిని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మరీ ఆంధ్రకు తరలిస్తున్నాయి. ఓటేస్తామంటే చాలు ప్రయాణం ఫ్రీ.. అంటున్నాయి పార్టీలు.   ఓట‌ర్ల‌ను తీసుకువెళ్ళి, ఓట్లు వేయించుకోవ‌డానికి  ఆంధ్ర రాజకీయ పార్టీలు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన‌ ఓటర్లు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో ఉంటున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 25లక్షల నుంచి 35లక్షల మంది ఏపీ స్థానికత కలిగిన ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారనే అంచనాలు ఉన్నాయి. వీరు త‌మ ఓటు వేయ‌డానికి  హైదరాబాద్ నుంచి   భారీ ఎత్తున ఆంధ్ర‌కు తరలి వెళుతున్నారు.   బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కావడంతో హైదరాబాదులో ఏపీ ప్రజలు లక్షల సంఖ్యలో స్థిరపడిపోయారు. ఉద్యోగం కోసం వెళ్ళిన వలస జీవులు కూడా వారిలో ఎందరో ఉన్నారు. సోమ‌వారం ఎన్నికలు.   పైగా వీకెండ్ కలిసి వచ్చింది. దీంతో  గ్రామాలకి తరలివస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అంతే కాదు ఈసారి ఎన్నికలను ఓటర్లు కూడా ఎంతో సీరియస్ గా తీసుకున్నారు.  కేవ‌లం హైదరాబాద్ నుంచే కాదు ఇటు కర్ణాటక నుంచి ఆంధ్ర కి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అద‌న‌పు బ‌స్సులు సమకూర్చినప్పటికీ ర‌ద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రయాణికులకు కొంత‌ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 400 సర్వీసుల్ని తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 300 సర్వీసులు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి కావడంతో పాటు ప్రత్యేక బస్సుల్లోనూ టికెట్లు రిజర్వు అవుతున్నాయి.  మే 10వ తేదీన 120, 11న 150, 12వ తేదీన 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సుల్ని విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమ హేంద్ర వరం, పోలవరం, కందుకూరు, కనిగిరి, ఉద యగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడుపుతున్నారు. తిరుగు ప్రయాణంలో 13, 14 తేదీల్లో ఏపీ నుంచి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అటు ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ప్రత్యేక బస్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.   సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లలో రిజర్వేషన్ జాబితా భారీగా ఉంటోంది. వెయిటింగ్ లిస్ట్‌ ఉన్న రైళ్లలో ప్రయాణికుల కోసం 22 రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లకు 10-13 తేదీల మధ్య, మరికొన్నింటికి 11- 14 వరకు ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు ప్రకటించారు.  సికింద్రాబాద్-విశాఖ, కాచిగూడ-గుంటూరు, వికా రాబాద్-గుంటూరు, విశాఖ-గుంటూరు, సికింద్రా బాద్-విజయవాడ, ధర్మవరం-నర్సాపూర్, తిరు పతి-గుంటూరు, హుబ్లీ-నర్సాపూర్, కాచిగూడ- రేపల్లె, బీదర్-మచిలీపట్నం తదితర రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

ఈ నెల 13న పోలింగ్ ... కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు

ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ్యులు  భారీ ఎత్తున సొంత రాష్ట్రం ఏపీకి తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు, సొంత పట్టణాలకు తరలివస్తున్న వారితో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి.  హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో ఏపీ ప్రజలు ఉన్నారు. వారందరూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండడంతో సొంత ఊరి బాటపడుతున్నారు. ఎన్నికలకు మరో రెండ్రోజుల సమయమే ఉండడంతో బస్సులు, రైళ్లలో, సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి పయనమవుతున్నారు.  సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా టిఎస్‌ఆర్‌టిసి సంస్థ ప్రత్యేక బస్సులు నడుపనుంది. టిఎస్‌ఆర్‌టిసి సంస్థ దాదాపుగా రెండు వేల ప్రత్యేక బస్సులు నడుపనుంది. . హైదరాబాద్‌లో ప్రయాణికులతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.  ఓటేసేందుకు ఏపీ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌, విజయవాడ బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో సందడిగా మారాయి. అయితే సరిపడా బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఏపీలోని ఇతర ప్రాంతాలకు సరిపడా బస్సుల్లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఓట్ల పండుగ వచ్చింది. ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వామ్యులు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లనుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. స్వగ్రామాలకు వెళ్లేందుకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుంటే, ఇంకొందరు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌ నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. పదిరోజుల నుంచే బస్సుల్లో సీట్లన్ని నిండుకున్నాయి. ముందస్తు బుకింగ్‌లు అయిపోవడంతో ప్రత్యమ్నాయ మార్గాలవైపు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్దాం అనుకుంటే దొరికిందే అనువుగా ఛార్జీలు అధికంగా పెంచేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులతోపాటు, ఏపీలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు వారికి రవాణా సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.  

చెల్లెళ్లు కన్నీరు మున్నీరు!.. జగన్ దుర్మార్గానికి నిలువెత్తు నిదర్శనం!

అమ్మా న్యాయం చేయండి.. ఐదేళ్లుగా అక్కాచెల్లెళ్లు న్యాయం కోసం పోరాడుతున్నారు.. మ‌న తెలుగు సాంప్ర‌దాయం ప్ర‌కారం ఆడ బిడ్డ‌లు పుట్టింటికి వ‌స్తే చీర‌సారె పెట్టి పంపిస్తారు.. మీ ఆడ బిడ్డ‌లు పుట్టింటికి వ‌చ్చి చీర‌సారె అడ‌గ‌డం లేదు.. కొంగు చాపి న్యాయం అడుగుతున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో ఓటు హ‌స్తం గుర్తుకు వేసి ష‌ర్మిల‌మ్మ కొంగు నింపాల‌ని కోరుకుంటున్నాను.. మీరంతా అలా చేస్తార‌ని నేను దృఢంగా న‌మ్ముతున్నాను.. ష‌ర్మిల‌మ్మ‌తోనే దివంగ‌త వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశ‌యాలు నెర‌వేరుతాయి.  ఈ మాటలన్నది ఎవరో తెలుసా?  అత్యంత దారుణంగా గొడ్డ‌లి వేటుకుగురై ర‌క్త‌పు మడుగులో గిల‌గిలాకొట్టుకొని క‌న్నుమూసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ.  ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌టంతో క‌డ‌ప‌లో ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ప్ర‌చార వాహ‌నంపై సునీత‌, ష‌ర్మిల చెరోప‌క్క నిల్చోగా మైకుప‌ట్టుకొని క‌న్నీరుపెడుతూ సౌభాగ్య‌మ్మ మాట్లాడం.. ఆమెను చూసి సునీత‌, ష‌ర్మిలలు క‌ళ్ల నుంచి ఉబికివ‌స్తున్న క‌న్నీటిని ఆపుకుంటూ ప్ర‌జ‌ల వైపు న్యాయంకోసం  చూడ‌టం క‌నిపించింది. ఆ ముగ్గురు మ‌హిళ‌లు న్యాయం కోసం క‌న్నీరు పెట్టుకున్న ప‌రిస్థితిని చూసి అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌లు చ‌లించిపోయారు. అంత‌టి హృద‌య విదార‌క‌మైన ఘ‌ట‌న‌కు కార‌ణం ఎవ‌రంటే ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తీఒక్క‌రికీ తెలుసు. ఆయ‌నే దివంగత వైఎస్ వివేకానందరెడ్డి అన్న కుమారుడు, షర్మిల, సునీతలకు అన్న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లుగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాక్ష‌స పాల‌న‌కు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, ఉన్నత వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తోపాటు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తే అక్ర‌మ‌కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంపించ‌డం. నిత్యం ర‌క్షాస పాల‌న‌ను త‌ల‌పించేలా జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న సాగింది. జ‌గ‌న్ దుర్మార్గ‌  పాల‌న‌కు రాష్ట్ర ప్ర‌జ‌లేకాక‌.. సొంత చెల్లెళ్లు సైతం క‌న్నీరు పెట్టుకుంటున్నారు. జ‌గ‌న్ బాబాయ్‌ వివేకా హ‌త్య కేసులో అవినాశ్ రెడ్డి కీల‌క ముద్దాయి అని సీబీఐ ఆధారాల‌తో సైతం రుజువు చేసింది. కానీ  అవినాశ్ కు జ‌గ‌న్ అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. దీన్ని భ‌రించ‌లేని సునీత‌, ష‌ర్మిల వివేకా హంత‌కుల‌ను అరెస్టు చేయాలంటూ న్యాయంకోసం పోరాడుతున్నారు. త‌న తండ్రిని హ‌త్య‌చేసిన హంత‌కుల‌ను శిక్షించాల‌ని కోరుతూ.. ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ వివేకా కుమార్తె సునీత తిరుగుతున్నారు. చెల్లెళ్ల న్యాయ‌పోరాటానికి సీఎం హోదాలో స‌హ‌కారం అందించాల్సిన జ‌గ‌న్‌.. వారిపై ఎదురుదాడి చేస్తూ, వైసీపీ సోష‌ల్ మీడియాద్వారా వారిపై లేనిపోని అబాండాలు వేస్తూ రాక్ష‌సానందం పొందుతున్నారు.  ఏపీలో రాష్ట్ర ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ ఐదేళ్ల పాల‌న‌లో ఎంత‌టి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ష‌ర్మిల‌, సునీత, సౌభాగ్య‌మ్మల  క‌న్నీరు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల ఓ ఇంగ్లీష్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యాక్టివ్ పాలిటిక్స్ లోకి రానివ్వనందుకే తన నుంచి షర్మిల, సునీత  దూర‌మ‌య్యార‌న్నారు. వారిని పార్టీలోకి చేర్చుకుని ఉంటే అది కుటుంబ రాజకీయం అయ్యేది. ప్ర‌స్తుతం వారసత్వ సమస్య కూడా లేదు. వైఎస్‌ వార‌సుడిగా నేను ఉన్నాను. నేనింకా యువకుడినే. మరో 20 ఏళ్ల తర్వాత అలాంటి సమస్య రావచ్చేమో. అది కుటుంబంలోని సంబంధాలను నాశనం చేస్తుంది. ఎవరైనా ఇంటికి వస్తే స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి రావాలి. కానీ, అన్నిచోట్లా రాజకీయాలు ఉండకూడదు అంటూ జ‌గ‌న్  ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టిచూస్తే.. వైసీపీలో ష‌ర్మిల ఉంటే ఆయ‌న‌కు క‌చ్చితంగా పోటీ అవుతార‌ని భావించి.. కావాల‌నే ష‌ర్మిల‌ను వైసీపీ నుంచి జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు పంపించార‌ని స్పష్టంగా అర్ధ‌మ‌వుతున్నది. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు ష‌ర్మిల స‌మాధానం చెప్పారు. ఈ క్ర‌మంలో త‌న సొంతఅన్న అలా మాట్లాడ‌టం జీర్ణించుకోలేక భోరున ఏడ్చారు. నువ్వు జైల్లో ఉంటే.. 19 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ప్రచారం చేయాలని అడిగింది నువ్వు కాదా జ‌గ‌న్‌?  చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతోంది,     పాదయాత్ర చేయి షర్మిలా అని కోరింది నువ్వు కాదా జగనన్నా?  నాకు రాజకీయ కాంక్ష ఉంటే..  నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు. అప్పుడు మొత్తం పార్టీ నా చుట్టూ ఉంది. నిజంగా నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను అప్పుడే పార్టీని హైజాక్ చేయలేనా?  అన్నీ జ‌గ‌న‌న్నే అనుకున్నా..  నా కుటుంబాన్నిసైతం వ‌దిలిపెట్టి నీ కోసం ప‌నిచేశా.. కానీ, నువ్వు నాకు చేసింది ఏమిటి జ‌గ‌న్ అంటూ ష‌ర్మిల క‌న్నీరు పెట్టుకుంటూ ప్ర‌శ్నించారు. రాజ‌కీయ ల‌బ్ధికోసం చెల్లెళ్ల‌ను రోడ్డుపైకి నెట్టేసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్ల ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఓటు ద్వారా త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. జ‌గ‌న్ ర‌క్ష‌స పాల‌న‌తో ప్ర‌జ‌ల‌తో పాటు ఉద్యోగులుసైతం ఇబ్బందులు ప‌డ్డారు. ఉద్యోగుల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచిన ఘ‌న‌త దేశంలో ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. దీంతో ఉద్యోగులంతా ఏక‌మ‌య్యారు.. మ‌రోసారి జ‌గ‌న్ అధికారంలోకి రాకూడదని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా జ‌గ‌న్‌కు గ‌ట్టి షాకిచ్చారు. మొత్తానికి చెల్లెళ్ల క‌న్నీటి ఉసురు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌ట్టిగానే త‌గ‌ల‌నుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బయటపడిన జగన్ బటన్ నొక్కుడు బండారం!

జగన్ బటన్ నొక్కుడు బండారం సందేహాలకు అతీతంగా బట్టబయలైపోయింది. ఎన్నికల లబ్ధి కోసమే ఆయన బటన్ నొక్కుడు వ్యవహారం అంతా సాగిందని సామాన్యులకు కూడా అర్ధమైపోయింది. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే వ్యూహంతోనే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ బటన్ నొక్కుడు సభలు నిర్వహించారని తేటతెల్లమైపోయింది. బటన్ నొక్కిన 24 గంటల లోగా లబ్ధిదారుల ఖాతాలలో పడాల్సిన సొమ్ము పడలేదని తేలిపోయింది. అంటే సంక్షేమం సొమ్ము పందేరం చేస్తున్నానంటూ గత మూడు నెలలుగా ఆయన నిర్వహించిన బటన్ నొక్కుడు సభలన్నీ ఎన్నికల ప్రచారం కోసమే కానీ, సొమ్మును లబ్ధి దారుల ఖాతాలలో సొమ్ములు వేయడానికి కాదని ఎన్నికల కమిషన్ బట్టబయలు చేసింది.  ఇంత కాలం బటన్ నొక్కాను సొమ్ములు పందేరం చేశాను అంటూ జగన్ సొంత సొమ్ములేవో జనాలకు పంచేసినట్లుగా బిల్డప్ ఇచ్చుకున్నారు.పాలన అంటే కేవలం సంక్షేమ పథకాల బటన్లు నొక్కడమే  అన్నట్లుగా వ్యవహరించారు. ఇక తన అధికారం చరమాంకానికి వచ్చిన దశలో కూడా  అదే బటన్ నొక్కడానికి అంటే ఒక బటన్ కాదు, గతంలో నొక్కిన ఆరు బటన్లకు సంబంధించిన సొమ్మును సరిగ్గా ఎన్నికల వేళ లబ్ధిదారుల ఖాతాలలో వేసి ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ఆయన చేసిన విశ్వ ప్రయత్నం విఫలమైంది.  జనవరి నుంచి మార్చి వరకూ నొక్కిన బటన్ల సొమ్ము ఇంత దాకా లబ్ధిదారులకు అందలేదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలలో సరిగ్గా ఎన్నికల వేళ జమయ్యేలా చేసి వారిని ప్రలోభ పెట్టి ఓట్లు దండుకుందామన్న కుట్రను ఎన్నికల సంఘం భగ్నం చేసింది.  ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.   ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈసీ ఆదేశాల మేరకు మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షాలు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా తానూ ప్రజలకు బటన్ నొక్కి మంచి చేయాలనీ చూస్తుంటే అధికారులను అడ్డుపెట్టుకుని బాబు ప్రజలకు మేలు చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు అంటూ ప్రచారం చేసుకోవడానికే జగన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ సంక్షేమ పథకాలంటూ గతంలో ఎప్పుడో నొక్కేసిన బటన్ కు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు తాజాగా ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి లబ్ధిదారులకు గాలం వేయాలని చూశారు.  అయితే మే 13న ఎన్నికలు ముగిసిన తరువాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరుపున లబ్ధిదారుల ఖాతాలలో  నగదు బదిలీ చేయాలి, ఆలోగా నగదు బదిలీ వద్దు అంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారం చేపట్టిన న్యాయస్థానం రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్ది దారుల ఖాతాలో ఎటువంటి నగదు జమ చేయవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 13 పోలింగ్ తేదీ ముగిసే వరకు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలోకి నగదు బదిలీ చేయడానికి వీల్లేదంటూ తేల్చేసింది.  ఎన్నికలకు రెండు రోజుల ముందు 14 ,165 కోట్ల నగదు లబ్ది దారుల ఖాతాలలో జమ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ   హైకోర్టు తీర్పు వెలువరించింది.  హైకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని ఆశపడిన వైసీపీకి మరోసారి చుక్కెదురైయింది.  ఇక ఇప్పుడు బటన్ నొక్కడం ప్రజల వంతు. ఐదేళ్లుగా బటన్ నొక్కుడు సంక్షేమంతో  మోసం చేసిన జగన్ కు జనం తమ బటన్ నొక్కుడు పవర్ చూపించనున్నారు.

పిఠాపురానికి రామ్ చరణ్..జనసేనానికి మద్దతు!

మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన బాబాయ్ కోసం పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో కలిసి ఆయన శనివారం పిఠాపురం వెడుతున్నారు. ఆయన నేరుగా  పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయరు. ఆయన తన తల్లితో కలిసి కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రామ్ చరణ్ నేరుగా ప్రచారంలో పాల్గొని పవన్ కల్యాణ్ కు ఓటు వేయమని ప్రజలకు పిలుపునివ్వకపోయినా, కచ్చితంగా పిఠాపురంలో మీడియాతో మాట్లాడతారు. తన బాబాయ్ కు మద్దతు పలుకుతారు. ఇంత కచ్చితంగా చెప్పడానికి కారణమేమిటంటే ఆయన పిఠాపురం వెళ్లి కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఎన్నుకున్న సమయమే కారణం. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగిసే చివరి రోజునే రామ్ చరణ్ తన తల్లితో కలిసి పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఇది కచ్చతంగా తన బాబాయ్ కు మద్దతును తెలియజేయడమే అవుతుంది.   అంటే రామ్ చరణ్ తన బాబాయ్ కోసం పరోక్షంగా ప్రచారం చేసినట్లేనని జనసేన శ్రేణులు అంటున్నారు. రామ్ చరణ్ పిఠాపురం పర్యటన అదీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసే చివరి రోజున నిస్సందేహంగా జనసేనలో జోష్ నింపుతుందని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా పిఠాపురం వచ్చి ప్రచారం చేయకపోయినా.. వీడియో సందేశం ద్వారా తన తమ్ముడికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తన వంతుగా రామ్ చరణ్ కూడా పిఠాపురంలో పర్యటించి తన బాబాయ్ కు మద్దతుగా నిలిచారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా మద్దతు ప్రకటించారు.  

12న ఈటీవీలో ‘రాజధాని ఫైల్స్’

అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా శ్రీమతి హిమబిందు సమర్పణలో, భాను దర్శకత్వంలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ కంఠంనేని నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రం ఈనెల 12 ఆదివారం నాడు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఒక దుర్మార్గుడు పాలకుడై రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే, ఆ దుర్మార్గుడిపై తిరగబడి, రైతులు సాధించిన విజయం ఈ చిత్రం.  మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తాను చేసే ప్రచారంలో సమయభావం వల్ల ప్రతీ ఊరికి, ప్రతీ ఇంటికి నేరుగా వెళ్లలేకపోయారు! అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బి.జె.పి. నాయకులు కూడా కొన్ని ప్రాంతాలకి వెళ్లలేకపోయారు..ఐనా తమ శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు. వీళ్ల కూటమిని గెలిపించండని ప్రజలందరికీ చెప్పడానికి తెలుగువన్ వారి "రాజధాని ఫైల్స్" చిత్రం మాత్రం ప్రతీ ఇంటింటికీ వెళ్లి తలుపు తడుతోంది, ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్కర్నీ ఆలోచింప చేయబోతోంది! రాజధాని లేని లోటుని.. కూటమి గెలుపు అవసరాన్ని ప్రజలకి తెలియజెప్పబోతోంది, అందుకే రేపు పోలింగ్ అనగా 12వ తేది ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో మీ ముందుకు వస్తోంది.! ఎంత ధైర్యం దానికి..! ఎంత శక్తి దానికి..!  దానికి కారణం అది ప్రజా బాణం.! కూటమి గెలుపుకి శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర భవితకు ఆకారం ఇవ్వబోతోంది.. "రాజధాని ఫైల్స్" చిత్రం.

అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్, విడుదల!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ లభించిన నేపథ్యంలో ఆయన తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన అరెస్టు అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూన్ 1 వరకు ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆయనను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. జైలు నుంచి కారులో బయటకి వెళ్తూ కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేశారు. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తీహార్ జైలు వద్దకు వచ్చారు. కేజ్రీవాల్ తన వాహనంలో ఇంటికి బయల్దేరారు. కేజ్రీవాల్ వాహనంలో ఆయన భార్య, కుమార్తె, ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ వున్నారు.  హనుమాన్ దయ వల్లే తాను బయటకి వచ్చానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తాను హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నానని ఆయన ప్రకటించారు.