జూన్ 4న జగన్ భారీ షాక్ తింటారు: ప్రశాంత్ కిషోర్

జగన్ లీడర్ కాదు.. ప్రొవైడర్ అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. లీడర్ భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ప్రొవైడర్ డబ్బులు ఇచ్చి పబ్బం గడుపుకుందామని అనుకుంటారు. జగన్ నంబర్ వన్ ప్రొవైడర్ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. పాతరోజుల్లో మహారాజులు ఎలా  తమను తాము ఎలా భావించేవారో జగన్ ఈ ప్రజాస్వామ్యంలో కూడా అలాగే తనను తాను మహారాజులా భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏమి కావాలో వారికి అది ఇవ్వాలి. ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్థిక సాయం కావలసిన వారికి సాయం చేయాలి.. ఇలా రకరకాలుగా పరిపాలన వుంటుంది. అంతే తప్ప మహారాజులు దానం చేసినట్టు చేయడం కుదరదు. అన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ, జగన్మోహన్‌రెడ్డి అలాకాదు.. ఒకటే దారి.. డబ్బు పంచడం.. పంచుతూనే వుండటం. జగన్ ఇలా అప్పులు తెచ్చి మరీ దానాలు చేస్తూ మహారాజులా భావించుకున్నారు అని పీకే విశ్లేషించారు. నెలనెలా డబ్బు పంచుతూ వుంటా.. రాష్ట్రం అప్పుల పాలైపోయినా పర్లేదు. అవినీతి అక్రమాలు పెరిగిపోయినా పర్లేదు... మిగతా విషయాలు నేను పట్టించుకోను అన్నట్టు తయారయ్యారు. ఆయన ప్రజల విషయంలో ఎలా వ్యవహరించారంటే, నెలనెలా నీకు ఐదు వేలు ఇస్తా.. నన్నేమీ ప్రశ్నించకు అన్నట్టుగా వ్యవహరించారు. అందుకే, ఈ జూన్ 4న జగన్మోహన్‌రెడ్డి ప్రజల చేతిలో పెద్ద షాక్ తినబోతున్నారు. జగన్ ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకోబోతున్నారు. ఆ గుణపాఠం కూడా అత్యంత దారుణంగా వుండబోతోంది అని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.

కోడి క‌త్తి డ్రామా.. సంబంధం లేని రెస్టారెంట్ యాజ‌మాన్యంపై జ‌గ‌న్ బ్యాచ్ వేదింపులు

కోడి క‌త్తి డ్రామా ఘ‌ట‌న‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశ‌వ్యాప్తంగా ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రికి సుప‌రిచిత‌మే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో సీఎం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఈ ఘ‌ట‌న  కూడా ఒక‌టి. కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ల‌తో జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగి వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఏపీ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వ‌చ్చారు. కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తోనే ఐదేళ్లు వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న సాగింది. విప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం.. వారిని జైల్లో పెట్టి పోలీసుల‌తో కొట్టించ‌డం ఇలా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌పై గ‌ళ‌మెత్తిన ప్ర‌తి ఒక్క‌రిని జ‌గ‌న్ టార్గెట్ చేసి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌ను త‌ట్టుకోలేక ప‌లువురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వేధింపుల‌కు గురైన వారిలో విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్‌లో రెస్టారెంట్ ఓన‌ర్ కూడా ఒక‌రు. స‌రిగ్గా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్‌పై కోడిక‌త్తితో శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి దాడి చేశారు. శ్రీ‌నివాస్ ప‌ని చేస్తున్నది.. విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఉన్న రెస్టారెంట్ లోనే. ఈ ఘ‌ట‌న‌లో అభ‌శుభం తెలియ‌ని రెస్టారెంట్ ఓన‌ర్ ని జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అనేక ఇబ్బందుల‌కు గురి చేశారు. తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వారికి ఎదురైన ఇబ్బందుల‌ను గుర్తుచేసుకుంటూ రెస్టారెంట్ ఓన‌ర్ స‌తీమ‌ణి ఓ వీడియోను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్ర‌జ‌లు.. అయ్య‌బాబోయ్‌.. జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ వారిని ఇంత‌గా ఇబ్బందుల‌కు గురి చేశారా అని ఆశ్య‌ర్య పోతున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో శ్రీనివాస్ అను వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ భూజానికి గాయమైంది. జ‌గ‌న్ విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకున్న  సమయంలో విమానాశ్రయంలో ప్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న జనుపెల్ల శ్రీనువాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కత్తితో దాడి చేశారు. ఆ దాడి ఘ‌ట‌న‌కు ఎయిర్ పోర్టులో రెస్టారెంట్ యాజ‌మాన్యానికీ ఎలాంటి సంబంధం లేదు. కేవ‌లం జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల్లో సానుభూతి పెంచేందుకు మాత్ర‌మే తాను ఈ దాడికి పాల్ప‌డ్డాన‌ని నిందితుడు శ్రీ‌నివాసరావు బ‌హిరంగంగానే చెప్పారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రెస్టారెంట్ యాజ‌మాని తొట్టెంపూడి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది.  బిజినెస్ చేయ‌డం చేత‌కాక నాశ‌నం అయింది అంటే దానికి ఆ యాజ‌మానే బాధ్యుడు అవుతాడు. కానీ, ప‌ని గ‌ట్టుకొని ప్ర‌భుత్వ‌మే జ‌రుగుతున్న బిజినెస్ ను క్లోజ్ చేసి పైశాచిక ఆనందం పొందిన‌ప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థ‌కాని ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోతారు. అదే ప‌రిస్థితి విశాఖ విమానాశ్ర‌యంలో ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్ ఓన‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఎదురైంది. లేని పోని ఆరోప‌ణ‌లు చేసి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంతోపాటు అందులో ప‌నిచేసే ఎంతో మందిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం రోడ్డుపాలు చేసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి .. కోడిక‌త్తి ఘ‌ట‌న కంటే ఆయ‌న తెలుగుదేశం సానుభూతి ప‌రుడుగా ఉండ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ   ఎన్టీఆర్, చంద్ర‌బాబు అంటే హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఇష్టం.  దీనిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోయారు. కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఎలాంటి సంబంధం లేద‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. నిందితుడు శ్రీ‌నివాస్‌రావు కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌కు కొద్ది నెల‌ల ముందునుంచే రెస్టారెంట్ లో స‌ర్వ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. పైగా జ‌గ‌న్ అంటే నిందితుడికి అభిమానం. కానీ, అభంశుభం తెలియ‌ని రెస్టారెంట్ యాజ‌మాన్యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేవ‌లం తెలుగుదేశం సానుభూతి ప‌రుడు అనే కార‌ణంతో క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది.  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో  హ‌ర్ష‌వ‌ర్ద‌న్ స‌తీమ‌ణి తొట్టెంపూడి శ్రీ‌ధేవి సొంత పేప‌ర్ ఉంద‌ని త‌మ‌పై జ‌గ‌న్ మీడియా ఇష్ట‌మొచ్చిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్న‌బాబు చిరుతిండ్లు అని సాక్షి మీడియాలో పెద్ద‌పెద్ద హెడ్డింగ్‌లు పెట్టి లోకేశ్ మా రెస్టారెంట్లో చిరుతిండ్లు తింటే ఆ బిల్లులు మేము అప్ప‌ట్లో తెలుగుదేశం ప్ర‌భుత్వానికి స‌బ్మిట్ చేశామ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని   ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిజంగా చెప్పాలంటే మా రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న‌ది లోకేశ్ కాదు.. వైసీపీ మంత్రులు, నాయ‌కులేన‌ని ఆమె కుండబద్దలు కొట్టినట్లు ఆ వీడియోలో చెప్పారు. క‌లెక్ట‌రేట్ నుంచి మాకు రావాల్సిన బిల్లులు ఇప్ప‌టికీ ఇవ్వ‌కుండా ఆపేశార‌ని   చెప్పారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ లిక్క‌ర్ డాన్‌, ఎవ‌రికో బినామీ అని జ‌గ‌న్ మీడియా త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. నేను న‌మ్ముకున్న‌ బాబా సాక్షిగా  చెబుతున్నా అవన్నీ పచ్చి అబద్ధాలు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.    

జగన్ దారుణంగా ఓడిపోతారు: ప్రశాంత్ కిషోర్

ఈసారి ఎన్నికలలో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జర్నలిస్టు రవిప్రకాష్‌తో జరిగిన మాటామంతీలో ఆయన జగన్ ఓటమి ఖాయమని, ఆ ఓటమి కూడా అలా ఇలా ఉండబోదని, చాలా దారుణంగా వుంటుందని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో జగన్ భారీ విజయం సాధించడానికి సహకరించిన నేనే ఈ మాట చెబుతున్నానంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జగన్‌తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదని, ఆయన తనకు చాలా మంచి మిత్రుడని... మిత్రుడైనప్పటికీ, ఆయన ఘోరంగా ఓడిపోబోతున్నాడన్న వాస్తవం చెప్పడమే న్యాయమని పీకే అన్నారు.  2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత జగన్ తనను తాను ఒక మహారాజుగా భావిస్తూ వచ్చారని, అభివృద్ధి గురించి ఎంతమాత్రం పట్టించుకోకుండా కేవలం జనానికి నెల తిరిగేసరికి డబ్బులు ఇస్తూ వుంటే, వాళ్ళు తనను పదేపదే ఎన్నుకుంటూనే వుంటారనే భ్రమల్లో జగన్ వున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఏపీ జనానికి నెలనెలా డబ్బులు కావాలి తప్ప ఇంకేమీ అవసరం లేదని జగన్ బలంగా నమ్ముతున్నారని ఆయన అన్నారు.  నెలనెలా డబ్బులు అకౌంట్లో వేస్తే చాలు రోడ్లు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారినా పర్లేదు, అప్పులు పెరిగిపోయినా పర్లేదు, శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేదే లేని రాష్ట్రం అయిపోయినా పర్లేదు, ప్రజలకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోయినా పర్లేదు, ప్రజలకు ముఖ్యమంత్రి కనిపించకపోయినా పర్లేదు అనే ఉద్దేశంలోనే జగన్ వున్నారని అన్నారు.  ఆమధ్య జగన్ - తాను ఢిల్లీలో కలిశామని, అప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావ్ జగన్, నువ్వు చేస్తున్న తప్పులు ఇవి అని ఆయనకు చెప్పాను. ఆయన నా మాటలు ఎంతమాత్రం పట్టించుకోలేదు అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. (ఇంకావుంది)

త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న ముఖ్యమంత్రుల వారసులు..!

ఏపీలోని 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప‌ది మంది మాజీ ముఖ్యమంత్రుల వార‌సులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల ఆరుగురు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు, మ‌రో ఇద్ద‌రు బంధువులు  ఎన్నికల బరిలో  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1) కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి  తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున‌ డోన్ నుంచి పోటీ చేస్తున్నారు.  మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.  గతంలో సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2) బాలకృష్ణ టీడీపీ త‌ర‌ఫున‌ హిందూపురం నుంచి పోటీలో వున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కుమారుడు బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యే రేసులో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచారు బాలయ్య. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు.  3)  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి,  టీడీపీ - జనసేన- బీజేపీ కూటమి నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో వున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి ఇప్పుడు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు.  4) నాదెండ్ల మనోహర్ జనసేన అభ్య‌ర్థిగా తెనాలి నుంచి పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్. తెనాలి నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నారు. వైఎస్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు.  5) నేదురుమల్లి  రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరపున వెంకటగిరి నుంచి బరిలో ఉన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు.  ఈయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 6) నారా లోకేశ్ టీడీపీ అభ్య‌ర్థిగా మంగళగిరి నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి ఓడిపోయిన లోకేశ్.. ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. 7) ప్రస్తుత సీఎం వైఎస్ జ‌గ‌న్‌ పులివెందుల నుంచి పోటోలో వున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బరిలో వున్నారు. కడప ఎంపీగా 2 సార్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి, 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షనాయకుడయ్యారు. 2019లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  8) వై ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి క‌డ‌ప ఎంపిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ కుమార్తె. షర్మిల త‌న అదృష్టాన్ని ఈ ఎన్నిక‌ల్లో పరీక్షించుకుంటున్నారు.  తండ్రి మరణానంతరం వైసీపీలో షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అనంతరం కుటుంబ తగాదాల నేపథ్యంలో ఏపీని వదిలి తెలంగాణలో పార్టీ పెట్టారు. ఇటీవల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టారు. కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఆరుగురు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుండగా,  మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు కూడా ఈ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  వీరే కాకుండా మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలకు చెందిన మరికొందరు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. 9) నల్లారి బ్రదర్స్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో వున్నారు.  మరోవైపు మాజీ ముఖ్య‌మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. 10) కాసు మహేశ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మహేశ్ రెడ్డిది కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి సోదరుడు వెంగళరెడ్డికి ఈయన మనవడు.  మహేశ్ రెడ్డి తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నరసరావుపేట ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. టంగుటూరి అంజయ్య, రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో ఆయన పనిచేశారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వేళ్ళ మీద ఇంకు గుర్తు వేస్తే చర్యలు

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ విషయంలో ఎలర్ట్ చేశారు. ఓటర్ల ఇళ్ళకు వెళ్ళి, వాళ్ళకి డబ్బు ఇచ్చి, వారి వేళ్ళ మీద ఇంకు గుర్తు వేసి, వాళ్ళు ఓటింగ్‌కి వెళ్ళకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతోపాటు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ తరహా కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళ మీద గుర్తు  వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేళ్ళ మీద వేసే సిరా ప్రభుత్వమే తయారు చేస్తుందని, ఆ ఇంక్ కేంద్ర ఎన్నికల సంఘం వద్దనే అందుబాటులో వుంటుందని ఆయన తెలిపారు. ఇతరుల దగ్గర చెరగని సిరా వుండదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఎవరైనా ఓటర్ల వేళ్ళ మీద ఇతర సిరాలతో గుర్తు వేస్తే, దానిని చట్టవ్యతిరేక చర్యగా భావించి కఠన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఐపీఎల్‌కు ధీటుగా ఏపీలో బెట్టింగ్! లోకేష్‌, ప‌వ‌న్‌పైనే ఫోకస్ ?

దేశవ్యాప్తంగా ఓ వైపు ఐపీఎల్ మరోవైపు ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇక ఐపీఎల్‌లో జోరుగా బెట్టింగ్ నడుస్తోండగా అటు ఏపీలోనూ అదే స్థాయిలో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. దీంతో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. అభ్యర్థుల గెలుపు, ఓటమి అంచనాలు, ఎన్నికల్లో మెజారిటీపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలు పూర్తిగా "జగన్ గెలుపు - జగన్ ఓటమి" పైనే జరుగుతున్నాయని ప్ర‌జ‌ల్లో చర్చ జ‌రుగుతోంది.  బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందేలు కాస్తున్న పరిస్థితి. ఒకటి రెండింతులు, మూడింతలుగా బెట్టింగ్ కాసేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. బుకీలు కూడా బెట్టింగ్స్‌కు సంబంధించిన దుకాణాలు తెరిచారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారే ఈ బెట్టింగ్ బిజినెస్ ఏపీలో అడ్డూ అదుపూ లేకుండా కొన‌సాగుతోంది. బెట్టింగ్ ఈ అంశాల‌పై జ‌రుగుతోంది.  1) వైసీపీ గెలుస్తుందా లేదా, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? 2) కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా?  మెజార్టీ ఎంత వ‌స్తుంది? 3) మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారా? మెజార్టీ ఎంత వ‌స్తుంది? 4) పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా? లేక అక్కడ వంగా గీత గెలుస్తారా? 5) హిందూపూర్‌లో బాల‌కృష్ణ‌కు మెజార్టీ ఎంత వ‌స్తుంది? 6) పులివెందులలో గ‌త ఎన్నిక‌ల‌కంటే మెజారిటీ తగ్గుతుందా? లేదా? 7) కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల విజయం సాధిస్తారా?  8) భీమిలిలో గంట శ్రీనివాసరావు గట్టెక్కుతాడా?  9) రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తాడా?  10)  వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? 11)  కూటమికి ఎన్ని సీట్లు వ‌స్తాయి? మంగ‌ళ‌గిరి, పుంగ‌నూరు, చంద్ర‌గిరి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, విజ‌యవాడ వెస్ట్‌, అన‌కాప‌ల్లి, ఫిఠాపురం,  రాజ‌మండ్రి, హిందూపూర్‌, కుప్పం, పీలేరుతో స‌హా ఏపీలోని 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బెట్టింగ్ జోరుగా న‌డుస్తోంది.  గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌నే  తేడా లేదు. పెద్ద ఎత్తున బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో బెట్టింగ్ కోట్ల రూపాయ‌ల్లోనే జరుగుతుందని చెప్పుకోవాలి. జగన్ మళ్లీ సీఎం అవుతాడా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, జనసేనాని పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా, ఈసారి పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశం బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందెం కాస్తున్నారు. ఐపీఎల్‌కు ధీటుగా ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జరుగుతుండటం విశేషం. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రోడ్డు ప్రమాదం.. బయటపడిన ‘కట్టల’ పాములు!

విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారి మీద యాక్సిడెంట్ జరిగింది. కెమెకల్ పొడి బస్తాలను తీసుకెళ్తు్న్న టాటా ఏస్ వెహికల్‌ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దాంతో టాటా ఏస్ వెహికల్‌లో వున్న కెమికల్ పొడి బస్తాలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అలా  పడిపోయింది కెమికల్ బస్తాలే అయితే మేటర్ మామూలుగానే వుండేది. కానీ అందులోంచి బోలెడన్ని ‘కట్టల’ పాములు బయటపడ్డాయి. మొత్తం ఏడు కోట్ల రూపాయల డబ్బు కట్టలు కెమికల్ పొడి బస్తాల మధ్యలో నుంచి బయటపడ్డాయి. నోట్ల కట్టలను చక్కగా ప్లాస్లిక్ కవర్లలో చుట్టి, అట్టపెట్టెల్లో పెట్టి, కెమికల్ పొడి బస్తాల మధ్యలో పెట్టి రవాణా చేస్తున్నారు. టైమ్ బ్యాడ్ అయి యాక్సిడెంట్ జరిగింది. నోట్ల కట్టల పాములు బయటపడ్డాయి. పోలీసులు ఈ ఏడు కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏస్ డ్రైవర్ని డబ్బు గురించి ప్రశ్నిస్తే మమ్మెమ్మే... బెబ్బెబ్బే అన్నాడు. ఇంకా లోతుగా విచారణ జరిపితే, ఒక వైసీపీ నాయకుడికి చెందిన సంస్థ నుంచి మరో వైసీపీ నాయకుడికి చెందిన సంస్థకు ఈ వాహనం రవాణా అవుతున్నట్టు తెలిసింది. అంటే, డబ్బు ఎవరిదో అర్థమైపోతుంది కదా..

ఏపీలో89శాతం పోలింగ్ జరిగే అవకాశం.. పరిశీలకుల అంచనా!

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (మే13) జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.  4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం రాష్ట్రంలో మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు సగానికి పైగా పోలింగ్ కేంద్రాలలో   వెబ్‌ కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం(మే 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. నిర్ణీత సమయంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు  తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్  మెడికల్ కిట్లను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచనుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు   ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.   3 లక్షల 30వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం లక్షా 14వేల మంది పోలీసు సిబ్బందిని నియోగిస్తున్నది.  వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు.  ఇక రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2, 387 మంది పోటీలో ఉన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీలూ ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా విపక్ష తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీ మధ్యనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా మున్నెనడూ లేని విధంగా ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దేవ వ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే ఏపీ బయట ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాలు చేసుకుంటున్న వారు ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు ఓటర్లు వస్తున్నారు. దీంతో ఈ సారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది 89శాతం వరకూ ఉండొచ్చన్నది అంచనా.  

జనం లేక పలుచన.. పిఠాపురం జగన్ సభ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణంలో అందరి దృష్టీ పిఠాపురంపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కూటమి బ లపరిచిన అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ దారులు ఇద్దరూ కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. పిఠాపురంలో విజయం కోసం ఇరు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి.  పిఠాపురంలో విజయాన్ని పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే ఎలాగైనా పవన్ కు ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా   పిఠాపురంపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. పవన్ కు మద్దతుగా మెగా హీరోలతో పాలు పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. ఇక వైసీసీ అధినేత జగన్ అయితే ప్రచారం ముగిసే  చివరి రోజున పిఠాపురంలో బహిరంగభలో ప్రసంగించారు.  ఆ సందర్భంగా ఆయన రాజకీయాల కంటే పవన్ వ్యక్తిగత జీవితాన్నే టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. ఆయన తన ప్రసంగంలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా  కర్లను మార్చేసినట్లు భార్యలను మార్చేసే జగన్ వద్దకు మహిళలు ఎవరైనా వెళ్లగలరా అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేశారు.  జగన్ వ్యాఖ్యల పట్ల మహిళలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జగన్ తన ప్రసంగంలో పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై జనం నవ్వి పోతున్నారు. ఆయన ఏ నియోజకవర్గంలో ప్రచారానికి వెడితే ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తాను, ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అంటూ చేస్తున్న ప్రకటనలపై నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. గత ఎన్నికలలో మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే మంత్రిని చేస్తానన్న జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే కుప్పంలో ప్రచారం నిర్వహిస్తూ జగన్ కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ చేసిన ప్రకటనపై కూడా నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. కుప్పంలో వైసీపీ గెలిస్తే కుప్పం ఎమ్మెల్యే మంత్రి అంటున్నారు. చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని గుర్తు చేస్తున్నారు. అయినా జగన్ ఎవరినైనా మంత్రిని చేయడానికైనా, ఉప ముఖ్యమంత్రిని చేయడానికైనా ముందు ఆయన, ఆయన పార్టీ ఈ ఎన్నికలలో విజయం సాధించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.  గత ఎన్నికలలో కూడా జగన్ భీమవరంలో పవన్ ను ఓడిస్తే అప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ ను మంత్రిని చేస్తానని ప్రకటించారు.  చేశారా అంటున్నారు.  జగన్ వాగ్దానాలు, హామీలపై జనంలో నమ్మకం పోవడానికి తన ఐదేళ్ల హయాంలో ప్రతి విషయంలోనూ మాట తప్పి, మడమ తిప్పడమే కారణమని అంటున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే చివరి రోజున వ్యూహాత్మకంగా పిఠాపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన జగన్ ప్రసంగించారు. అయితే ఆ సభకు జనం పలుచగా ఉండడాన్ని బట్టి అక్కడ వైసీపీ శ్రేణులే చేతులెత్తేశారని అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రోడ్డుపైనే తిట్టుకున్న కొడాలి నాని అనుచరులు

మొన్నామధ్య వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాలో తన నాయకుడు కేక్ కట్ చేసి, తనకు కాకుండా మరొకరికి పెట్టాడన్న కోపంతో ఒక కార్యకర్త తన నాయకుడినే కత్తితో పొడుస్తాడు. ఇంత రేంజ్‌లో జరగలేదుగానీ, తమ నాయకుడు తమకు కాకుండా ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చాడన్న కోపంతో రోడ్డు మీదే గొడవపడి, తిట్టుకున్న సంఘటన గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొడాలి నాని శనివారం నాడు తన అనుచరులతో కలసి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని గుడ్లవల్లేరుకు చేరుకున్నారు. ఆ ఊళ్ళో వున్న వైసీపీకి రెండు వర్గాలు వున్నాయి. వర్గం నంబర్ వన్‌కి చెందిన వ్యక్తులు కొడాలి నాని ప్రచారం చేస్తున్న వాహనం మీద ఎక్కారు. అది చూసి వర్గం నంబర్ టూకి చెందిన వ్యక్తులకు కోపం వచ్చింది. మమ్మల్ని కాకుండా వాళ్ళని వాహనం మీద ఎక్కించుకుంటారా అని కొడాలి నానిని నిలదీశారు. దాంతో ఆ వర్గానికి, ఈ వర్గానికి మధ్య వాగ్వాదం జరిగింది. తిట్టుకోవడం వరకు విషయం వెళ్ళింది. వాళ్ళు అలా తిట్టుకుంటూ వుండగానే, సమస్యని పరిష్కరించాల్సిన కొడాలి నాని చక్కగా తన కారును తానే డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దాంతో రెండు వర్గాలూ షాకైపోయి నోళ్లు మూసుకున్నారు.

మంత్రి అమర్‌నాథ్ చొరవ.. 50 ఎకరాలు స్వాహా!

తిరుపతి విమానాశ్రయం పక్కనే వున్న 50 ఎకరాల ఏపీఐఐసీ భూమిని మంత్రి అమరనాథ్ రియల్‌ఎస్టేట్ పరం చేశారు. అయినవారికి లబ్ధిని చేకూర్చడం కోసం నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు మార్చేసి భూమిని గుటకాయస్వాహా చేసేశారు. పారిశ్రామిక అవసరాలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తిరుపతిలో కేటాయించిన 50 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామని దాన్ని రాయితీ ధరపై తీసుకున్న కంపెనీ కోరితే గుడివాడ అమర్‌నాథ్ ఆశీస్సులతో ప్రభుత్వం ఓకే చెప్పింది. ఆ భూమిని సదరు సంస్థకి కేటాయించింది పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమేనని ఏపీఐసీసీ మొత్తుకుంటున్నా అమర్‌నాథ్ వినలేదు. పాత ఉత్తర్వులను రివర్స్ చేసి, ఏ సంస్థకు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించారో అదే సంస్థ అక్కడ హోటళ్ళు, విల్లాలు కట్టుకోవడానికి అనుమతి వచ్చేలా చేశారు. అంతే కాదు, సదరు సంస్థ నుంచి ఏపీఐసీసీకి రావల్సిన 32 కోట్ల రూపాయల బకాయిలను కూడా రద్దు చేశారు. మొత్తం ఈ వ్యవహారంలో 35 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దళితుడిపై కోన వెంకట్ దాడి

సినీ రచయిత, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి బంధువు, సినీ రచయిత అయిన కోన వెంకట్ కత్తి రాజేష్ అనే యువకుడి మీద తన అనుచరులతో కలసి దాడి చేశారు. ఆ దాడి కూడా సాక్షాత్తూ పోలీస్ స్టేషన్లోనే కావడం గమనార్హం. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో ఈ ఘటన జరిగింది. గతంలో వైసీపీలో వున్న కత్తి రాజేష్, తెలుగుదేశం అభ్యర్థి నరేంద్రవర్మ సమక్షంలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. మా దగ్గర 8 లక్షలు తీసుకున్న కత్తి రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారంటూ వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కత్తి రాజేష్‌ని కర్లపాలెం పోలీస్ స్టేషన్‌కి తెచ్చారు. ఎస్.ఐ. ఛాంబర్లో ఎస్.ఐ. జనార్దన్, కోన వెంకట్, ఇతర వైసీపీ నేతలు దాడి చేసి కొట్టారని తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపాయి. స్పందిన డీఎస్పీ మురళీకృష్ణ కత్తి రాజేష్‌పై దాడి చేసిన కోన వెంకట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్.ఐ. జనార్దన్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సైలెన్స్!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో  గత నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.హైదరాబాద్‌, తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ స్వస్థలాలకు లక్షలాదిగా వస్తున్నారు.  ఇక ఎన్నికల కమిషన్ పోలింగ్ ముగిసే వరకూ రాష్ట్రంలోని  పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందనీ,  ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించింది. ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు అంటే మే 13 సాయంత్రం 6 గంటల వరకు  వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు.   పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరగకుండా పోలీసుల నిఘా ఉంటుంది.  ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుంది. అలాగే మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం కూడా నిషేధం. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా  విధించే అవకాశం ఉంటుంది.

పిఠాపురంలో  పవన్ కళ్యాణ్ ప్రచారం 

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు , ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల మేరకు ప్రచారం కాసేపట్లో ముగియనుంది. ఎ.పి.లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఆ పార్టీ ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌కి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఇతర రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా పవన్‌ని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పిఠాపురం వెళ్ళారు. రాజమండ్రి విమానాశ్రయం వద్ద మెగా అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. చరణ్‌కు ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ఎయిర్‌ పోర్టు ఎగ్జిట్‌ గేట్‌ వద్ద సందడి నెలకొంది. చరణ్‌తో పాటు ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. అక్కడి నుంచి చరణ్‌ పిఠాపురంకు బయల్దేరారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వరస్వామి వారిని చరణ్‌ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పిఠాపురం పట్టణంలో ఆయన పర్యటిస్తారు.

చెల్లెలి ఉసురు జగన్‌కి తగిలి తీరుతుంది

నో డౌట్.. జగన్‌కి తన చెల్లెలు షర్మిల ఉసురు తప్పకుండా తగులుతుంది. అధికారం తుడిచిపెట్టుకుని పోతుంది. సొంత చెల్లి షర్మిల అన్నను విభేదించిన పాపానికి ఆమె మీద సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ చేత నానామాటలు అనిపించాడు జగన్. షర్మిలను అన్ని రకాలుగా అవమానించాడు. సొంత అన్న అయి వుండి, చెల్లెలు కట్టుకున్న చీర మీద కామెంట్లు చేశాడు. చివరికి ఆమె పుట్టుక విషయంలో కూడా దుష్ప్రచారం చేయించాడు. ఇవన్నీ మీడియా ముందు చెప్పుకుని షర్మిల కన్నీరు పెట్టుకుంది. ఇంటి ఆడపిల్ల కంట కన్నీరు పెట్టించిన జగన్ కన్ఫమ్‌గా ఫలితం అనుభవిస్తాడు. పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే షర్మిలను, జగన్ 16  నెలలపాటు జైల్లో వుంటే, అన్నాళ్ళూ పార్టీని కాపాడిన షర్మిలను, అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిలను ఈ రకంగా అవమానించడం నిజంగా దారుణం. ఈ పాపాలన్నిటికీ ఫలితం అనుభవించడానికి జగన్ మానసికంగా సిద్ధపడాలి.