ప్రేయసికి కడుపు చేసి వదిలేసిన ప్రియుడు
posted on Aug 27, 2012 @ 12:25PM
నల్గొండ జిల్లాలోకల్లెపల్లి గ్రామానికి చెందిన నాగార్జున, బుల్లి (19) అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి వేదిలేసాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగార్జునను పిలిపించి బుల్లిని పెళ్లి చేసుకోవాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని చెప్పారు. అయినా అతడు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుల్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పోలీస్ స్టేషన్ ఎదుట తాగి౦ది. వెంటనే ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. బుల్లి మృతికి కారణమైన నాగార్జునపై పోలీసులు కేసు నమోదు చేశారు.