చిత్తూరులో మరో సైకో
posted on Jul 28, 2012 @ 4:09PM
చిత్తూరు జిల్లాలో ఓ సైకో హల్చల్ చేశాడు. శ్రీకాళహస్తి మండలం బూరగమాను కండ్రిగ సమీపంలోని అరుంధతి వాడలో ఓ వ్యక్తి కత్తి పట్టుకుని అనుమానంగా సంచరిస్తున్నాడు. ఓ మహిళను బెదిరించడంతో ఆమె గట్టిగా అరిచింది. దీంతో అతను పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి మరాఠీ భాష మాట్లాడుతున్నాడని.. అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని ఆయన చెపుతున్నారు.