చనిపోయేముందు భర్తకు మెయిల్ పెట్టిన నీలిమ
posted on Aug 5, 2012 @ 12:50PM
ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ చనిపోయే ముందు తన భర్తకు పంపిందని తెలుస్తోంది. నీలిమ పంపిన మెయిల్ లో నా దారి వేరు.. నీదారి వేరని..నువ్వు చాల మంచివాడివని.. నాది సహజ మరణంగా భావించి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని నీలిమ పంపించింది. నీలిమ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో భాగంగా రాయదుర్గం పోలీసులు ఆమె ఈ-మెయిల్‌ను బ్రేక్ చేశారు. శనివారం ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో దాన్ని ఓపెన్ చేసి అందులోని వివరాలు తెలుసుకున్నారు. నీలిమ తన ఆఖరి ఈ-మెయిల్‌లను భర్తతోపాటు విశాఖపట్నానికి చెందిన స్నేహితుడు ప్రశాంత్ అలియాస్ పండుకు పంపినట్లు.. చివరి ఫోన్‌కాల్ ప్రశాంత్‌కే చేసినట్లు నిర్ధారించారని తెలుస్తోంది.