ఒంగోలు లో చంద్రబాబునాయుడు
posted on Aug 10, 2012 @ 10:39AM
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం ఒంగోలు చేరుకున్నారు. ఒంగోలు నుంచి బయల్దేరిన ఆయన గుండాయపాలెం మండలం చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి బాబు ప్రసంగించనున్నారు. గుండాయపాలెం నుంచి పాతపాడు వరకూ అయిదు కిలోమీటర్ల మేర వాన్పిక్ భూముల్లో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. రాత్రికి ఒంగోలు చేరుకుని గాంధీనగర్లో ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన రైలులో హైదరాబాద్ బయల్దేరతారు.