ఉప రాష్ట్రపతి ఎన్నికలకు టిడిపి దూరం
posted on Aug 5, 2012 @ 4:59PM
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఆదివారం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. త్వరలో వర్షాకాల సమావేశాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశంపై, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. గ్యాస్ కేటాయింపులు, కరువు సహాయం, విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఈ భేటీలో టీడీపీ నిర్ణయించింది.