అమెరికాలో ఘోర ప్రమాదం, 5 తెలుగువారు మృతి
posted on Aug 11, 2012 8:40AM
అమెరికాలోని ఓక్లహామా నగరంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు యువకులు మరణించారు. వీరంతా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని సుబ్బయ్యగారి జస్వంత్‌రెడ్డి, గాదె ఫణీంద్ర, అంతటి అనురాగ్, శ్రీనివాస్, వెంకట్‌గా గుర్తించారు. గురువారం రాత్రి వీరంతా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరెవరూ సీట్‌బెల్టులు పెట్టుకోలేదని, అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఒకరు ఖమ్మంజిల్లాకు చెందినవారు కాగా, మరొకరు హైదరాబాద్ వాసి అని, మిగతా ముగ్గురూ కూడా హైదరాబాద్ పరిసరప్రాంతాల వారేనని తెలిసింది.