మళ్ళీ దాడులు మొదలెట్టిన జగన్ పార్టీ
posted on May 13, 2014 @ 4:47PM
ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, నాయకుల మీద దాడులు చేసే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేటెంటు హక్కులు పొందినట్టుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద నిర్విరామంగా దాడులు చేస్తూనే వుంది. మొన్నటి వరకూ ఎన్నికల సందర్భంగా విపరీతంగా దాడులు చేసింది. పోలింగ్ జరిగే రోజుల్లో కూడా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి చావబాదారు. సాక్షాత్తూ టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు మీదే దాడిచేశారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. పోలింగ్ ముగిసింది కదా, ఇక వైసీపీ దాడులు వుండవులే అనుకున్నవారికి షాకిస్తూ జగన్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం నాయకుల మీద దాడులు ప్రారంభించారు. మంగళవారం రోజున గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరిపాలెంలో వైకాపా కార్యకర్తలు విశ్వరూపం చూపించారు. తెలుగుదేశం కార్యకర్తకి చెందిన హోటల్‌ని తగులబెట్టారు.హోటల్ తగలబడిపోవడంతోపాటు ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలావుంటే, రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాలలో తెలుగుదేశం నాయకుడి హత్య వెనుక ఎవరున్నారో బయటపడాల్సి వుంది.