సింగపూర్‌లో టాయ్‌లెట్ సీట్లో పాము
posted on May 13, 2014 @ 4:34PM
మన రాజకీయ నాయకులు సీమాంధ్రని సింగపూర్‌లా చేసేస్తామని చెబుతూ వుంటారు. సింగపూర్ చాలా మోడ్రన్ అనే ఉద్దేశంతో అలా అంటూ వుంటారు. సింగపూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి చదివితే సింగపూర్ ఇంకా డెవలప్ కావల్సింది చాలా వుందని అర్థమవుతుంది. సింగపూర్‌లోని ఓ హైక్లాస్ ఏరియాలో ఒక హైక్లాస్ ఇంట్లో ఆ ఇంటి ఓనరమ్మ టాయ్‌లెట్‌లోకి వెళ్ళింది. ఆమె టాయ్‌లెట్‌లోకి అలా వెళ్ళిందో లేదో ఇలా టాయ్‌లెట్ సీట్లోంచి ఒక పాము సర్రుమని బయటకి వచ్చి ఆమె కాలుమీద కసిదీరా కాటేసింది. మళ్ళీ టాయ్‌లెట్ సీట్లోకి వెళ్ళి లోపల సెటిలైంది. పాముకాటుకి గురైన మహిళ లబోదిబోమని టాయ్‌లెట్‌లోనుంచి బయటికి పరుగెత్తి ఇంట్లోవాళ్ళకి అసలు విషయం చెప్పి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ ఇంట్లోవాళ్ళలో కొంతమంది ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్తే, మరికొందరు టాయ్‌లెట్ సీట్లో రెస్ట్ తీసుకుంటున్న పాముగారిని చావబాది అవతల పారేశారు. పాముకాటుకి గురైన మహిళ అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి బయటపడింది.