దొంగే దొంగ, దొంగ అని అరిచినట్లుంది
posted on Apr 2, 2013 @ 5:06PM
ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష చూస్తుంటే దొంగే దొంగ, దొంగ అన్నట్లుగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు వైయస్ కుటుంబ సభ్యులు స్థాపించిన పార్టీయే విద్యుత్ పైన దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
విద్యుత్ సంక్షోభం విషయంలో ఈ నెల 9వ తేది వరకు తెలుగుదేశం పార్టీ సంతకాల సేకరణ చేపడుతుందని సోమిరెడ్డి అన్నారు. టిడిపి, కాంగ్రెసు హయాంలోని విద్యుత్ పైన తాము ప్రజల ముందుకు వెళ్తామన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు టిడిపి తమ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదన్నారు.
విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యుత్ కోత కారణంగా రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. విద్యుత్ సమస్యపై సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు.