కేటీఆర్ కు విషెష్ చెబుతూ సెటైర్లు.. షర్మిలను ఆటాడుకున్న నెటిజన్లు
posted on Jul 24, 2021 @ 8:39PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా పార్టీ శ్రేణులతోపాటు మంత్రులు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కేటీఆర్ కు బర్త్ డే విషెష్ చెబుతూ దేశ వ్యాప్తంగా ప్రముఖులు ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు శుభాకాంక్షలు వెలువెత్తాయి. రాజకీయాలకు అతీతంగా నేతలు ఆయనకు విషెస్ చెప్పారు.
వైఎస్ఆర్ టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయన్ను నేరుగా మంత్రి కేటిఆర్‌గా కాకుండా మరోసారి సీఎం కేసిఆర్ గారి కొడుకు కేటిఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. గతంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూనే సెటైర్లు వేశారు.ఆయనకు భగవంతుడు ఆయురాగ్యోలతోపాటు రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే శక్తిని ఇచ్చే విధంగా లక్షా 91 వేల ఉద్యోగ ఖాలీలను భర్తి చేసే పట్టుదలను ఇవ్వాలని ట్వీట్ లో పేర్కొన్నారు.
దీంతోపాటు 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నానని షర్మిల ట్వీట్ చేశారు. చివరి ట్విస్ట్ గా వనపర్తికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని లావణ్య ఆత్మహత్య చేసుకున్న వీడియోను కానుకగా ఇస్తున్నాట్టు ఆ వీడియోను పోస్టు చేసింది.
కేటీఆర్ కు విషెస్ చెబుతూ షర్మిల పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బర్త్ డే రోజున ఇలాంటి పోస్టులు ఏంటని కొందరు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇదివరకు కేటీఆర్ ఎవరో తెలియదని చెప్పావ్ మరి విషెస్ దేనికని మరికొందరు ప్రశ్నించారు. షర్మిల ఎన్ని జిమ్మిక్కులు చేసినా..తెలంగాణలో ఆమె పార్టీకి ఉనికి ఉండదని మరికొంతమంది అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం షర్మిలను విపరీతంగా ట్రోల్ చేశారు. చంద్రకాంత్ రెడ్డి మొదటి భార్య, బ్రదర్ అనీల్ శాస్త్రీ రెండో భార్య షర్మిలకు కృతజ్ఞతలు అంటూ విరుచుకుపడ్డారు. కరోనాను కాలితో తొక్కి చంపే, వానలను తిట్లతో ఆపే మత ప్రచారకుడి సెకండ్ హ్యాండ్ బాణం అంటూ కౌంటర్లు వేశారు. బాబాయ్ లాగా తనకు అవుతుందోమోనన్న భయంతోనే తెలంగాణకు షిప్ట్ అయిందని మరికొందరు ఆరోపిస్తూ పోస్టులు పెట్టారు.
మొత్తానికి కేటీఆర్ బర్త్ డే రోజున వైఎస్ షర్మిల చేసిన పోస్టు రాజకీయంగా రచ్చగా మారింది. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంలో హుందాగా వ్యవహరించాలని.. కాని షర్మిల ఓవరాక్షన్ చేసిందనే విమర్శలే ఎక్కువగా వినిపించాయి. చంద్రబాబు, జగన్ సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు పద్దతిగా చెప్పుకుంటారని, షర్మిల తీరు సరిగా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పరిపక్వత లేనట్లుగా షర్మిల వ్యవహరిస్తున్నారనే టాక్ జనాల నుంచి కూడా వస్తోంది.