మంగళసూత్రాలు ఇవ్వలేదంటున్న షర్మిలా
posted on Mar 10, 2013 @ 12:54PM
గుంటూరు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలా.. చంద్రబాబుకు హామీలు ఇవ్వడం తప్ప అవి తీర్చడం తెలియదని అంటోంది. 1999 ఎన్నికలకు ముందు ప్రచారంలో అధికారంలోకి వస్తే మహిళలకు మంగళసూత్రాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారని వైఎస్ షర్మిల అన్నారు. నిజంగా చంద్రబాబు ఆ హామీ ఇచ్చారో లేదో కాని, ఇప్పుడు షర్మిల ఆ వాగ్దానం చంద్రబాబు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు.
మరోవైపు ఈ రోజు మహాశివరాత్రి కావడం, గుంటూరు జిల్లాలో కోటప్పకొండ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని షర్మిల పాదయాత్రకు ఈ రోజు విరామం ప్రకటించారు. తిరిగి సోమవారం పాదయాత్ర ప్రారంభమవుతుంది.