జగన్ తీహార్ జైలుకు!
posted on May 29, 2013 @ 11:00AM
ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైఎస్ జగన్ ను తీహార్ జైలుకు తరలించేందుకు రంగం సిద్దం అయిందని, రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగుతులుండవని” టీడీపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణపై టీడీపీ స్పష్టంగా ఉందని, 2008లో రాసిన లేఖకు కట్టుబడి ఉందని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని టిడిపి లేఖ రాసిందని నామా అన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణ, సీమాంధ్రలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, అది కలెక్షన్ పార్టీ అని మాటలు చెప్పి మూటలు తీసుకుంటారని, సోనియాను కలిసిన కేశవరావు మళ్లీ కేసీఆర్ ను కలిశారని, కేసీఆర్ పార్టమెంటుకు రారని, తెలంగాణ ప్రజల సమస్యలపై నోరు విప్పరని ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ అసమర్ధుడని, అవినీతి, అసమర్ధ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ రాష్ట్రాన్ని అభివృద్ది చేసిందని, టీడీపీ చొరవవల్లనే కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా టిడిపి కీలక పాత్ర పోషిస్తుందని, దేశానికి, రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని అన్నారు.