చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్!
posted on Apr 20, 2020 @ 12:47PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఇలాగే పూర్తి ఆరోగ్యంతో, చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుతూ ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.
రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం వుంటుంది. పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నేతలు వేడిపుట్టిస్తూ వుంటారు. అయినప్పటికీ చంద్రబాబు పుట్టిన రోజు అనగానే సీఎం జగన్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు విషెస్ తెలిపారు.
ప్రస్తుతం 71వ సంవత్సరంలోకి వెళ్తున్న చంద్రబాబు... తన పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులూ ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని కోరారు. కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉంది కాబట్టి... దాన్ని పాటిస్తూ... ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండటమే అసలైన అభిమానం అని చంద్రబాబు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రతిపక్షంలో ఉంటూ... చంద్రబాబు... ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ... కరోనాపై పోరాటంలో... దేశానికీ, ఏపీకీ అండగా ఉంటున్నారని ప్రశంసిస్తూ అభిమానులు ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు అందిస్తున్నారు.