ప్రియురాలు కరోనా మరణం.. తట్టుకోలేక ప్రియుడు మృతి..
posted on Jul 22, 2021 @ 10:41AM
ప్రేమంటే చంపడమే కాదు, చావడం కూడా ,ఒక అమ్మాయి ప్రేమించలేదని ఆ అమ్మాయి పై దాడి చేయడమే కాదు.. అవసరం అనుకుంటే ప్రేమించిన అమ్మాయి కోసం మరంచడానికి కూడా సిద్ధంగా ఉండడం అని కూడా నిరూపించాడు ఒక వ్యక్తి. బట్ అలా చనిపోవడం తప్పు. కానీ.. అతను తన ప్రియురాలు లేదనే మాట తట్టుకోలేడు అందుకే అలా మరణించాడు. మ్యాటర్ లోకి వెళితే.. తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి కరోనా బారిన పడింది. తన ప్రియురాలు కోలుకోవాలి అని ప్రియుడు కోరుకున్నాడు. కానీ ఆ దేవుడు అతని కోరికను వినిపించుకోలేదు. మూడు రోజుల క్రితం అతని ప్రియురాలు మరణించదని తట్టుకోలేకపోయిన యువకుడు తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖలోని గాజువాకలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
పరవాడ మండలం దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్ (25) ఇంటర్ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్‌లో ఆన్‌లైన్ పార్శిల్ సర్వీసు పని చేస్తున్నాడు. ఆరుగురు ఫ్రెండ్స్‌తో కలిసి కణితి రోడ్డులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకూ సహచర మిత్రులతో పార్శిల్ సర్వీసు కొనసాగించిన రోహిత్ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఏదో మూడ్ ఆఫ్ తో వర్క్ మానేసి రూమ్ కి వెళ్ళాడు. ఫ్రెండ్స్ అందరు ఏదో చిన్న బాధలో ఉన్నట్లు ఉన్నాడు అనుకున్నారు. రూంకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు లే అని అనుకున్నారు.
కట్ చేస్తే సాయంత్రం రోహిత్ మిత్రులు రూమ్ కి వచ్చారు. డోర్ ఓపెన్ చేసి చూడగా రోహిత్ సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతున్నాడు. అందరు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మెల్లిగా షాక్ లో నుండి తేరుకుని వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లీదండ్రులు పరుగున సంఘటన స్థలానికి వచ్చారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. తనకు కొడుకు అనకాపల్లికి చెందిన యువతిని ప్రేమించాడని, ఆమె మూడురోజుల క్రితం గుంటూరులో కరోనాతో చనిపోయిందని రోహిత్ తండ్రి కృష్ణారావు తెలిపారు. ఆమె మరణంతో రోహిత్ కుంగిపోయాడని, ఆ విషయం తట్టుకోలేకే ఈ పని చేశాడని. తాము మరో సంబంధం చూసి పెళ్లి చేస్తామని ఎంత నచ్చజెప్పినా ఆ విషాదంలోని నుంచి తేరుకోలేకపోయాడని పేర్కొన్నారు. ఆ డిప్రెషన్‌తో తమ కొడుకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆయన పోలీసులకు తెలిపారు. గాజువాక పోలీసులు రోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.