కరోనాకు బలైపోయిన వైద్య విద్యార్థిని..
posted on Jun 2, 2021 @ 2:25PM
సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. రోజుకు లక్షలాది కేసులు నమోదుతున్నాయి.. మరణాలు వేలల్లో ఉంటున్నాయి. ఈ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి వైద్య సిబ్బందిని సైతం కాటేస్తోంది. ప్రాణం ఇచ్చింది అమ్మనాన్న అయితే, కరోనా టైం లో ప్రాణం పోస్తుంది డాక్టర్స్ అని చెప్పాలి. డాక్టర్ వృత్తి ఏ భూమి మీద చాలా పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన వృత్తికి కొంత మంది అప కీర్తి తెస్తున్నారు.. కానీ కొంత మంది డాక్టర్స్ నీతిగా నిజాయిగా తమ సేవలు అందిస్తున్నారు.. అలా నీతిగా నిజాయితీగా పని చేసిన ఒక లేడీ యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఆమె చిన్నపట్టి నుండి డాక్టర్ అవ్వాలని కలలు కన్నది. చివరికి అనుకున్నట్లు గానే డాక్టర్ అయింది. కరోనా టైం లో రోగులకు నిరంతరం ఆమె సేవలు అందించింది. చివరికి అదే వ్యాధికి గురై చనిపోయారు.
అది తూర్పు గోదావరి జిల్లా. సఖినేటిపల్లి మండలం. అంతర్వేదిపాలెం. చెందిన కందికట్ల రోజి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమంలోనే ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఎప్పటి నుండి వేసుకున్న తెల్ల కొట్టుకు న్యాయం చేయాలని. అక్కడే కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది కరోనా టైములో ధైర్యాన్ని ఇచ్చారు. సేవలో నిమగ్నమయ్యారు నిస్వార్ధంగా పని చేసింది. మన దేశంలో నాయకులకు కనికరం లేనట్లు గానీ, కరోనా కు కనికరం లేదని మరోసారి నిరూపించింది. ఈ క్రమంలో యువ వైద్యురాలు కరోనా వల్ల అనారోగ్యం బారినపడ్డారు. అయినా ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె దగ్గరలో ఉన్న సుబ్బమ్మ అనే కొవిడ్ కేర్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. ఇంతలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి, కొన్నిరోజులుగా కరోనా తో పోరాడిన ఆమె తాజాగా కన్నుమూశారు. ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టిన యువ వైద్యురాలు మృతి చెందడంతో అంతర్వేది పాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి వైద్యురాలు చనిపోవడంతో వైద్య సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ద డాక్టర్ కావాలని కలలు కంది. పేదలకు సేవ చేయాలి అనుకుంది.