ఎర్రబెల్లి అల్లుడికి జహీరాబాద్ టికెట్

 

 

 

 

టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్‌మోహన్‌కు జహీరాబాద్ లోక్‌సభ టికెట్ ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత౦లోనే ఎర్రబెల్లి తన అల్లుడికి జహీరాబాద్ లోక్‌సభ టికెట్ ఇవ్వలని టిడిపి అధినేతను కోరారు. కొద్ది రోజుల క్రితం ఎర్రబెల్లి తన అల్లుడితో కలిసి పాదయాత్రలో ఉన్న బాబును కలిసినప్పుడు టికెట్ కేటాయింపును ఆయన ధ్రువీకరించినట్లు సమాచారం. ఆ నియోజకవర్గంలో పనిచేసుకోవాలని ఆయన మదన్‌కు సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలు కలిపి జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. జహీరాబాద్‌తో కలిపి టీడీపీ ఇప్పటి వరకూ 15 లోక్‌సభ స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Teluguone gnews banner