బద్వేలులో తిరుపతి స్కెచ్! దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ లీడర్స్?
posted on Oct 30, 2021 @ 10:13AM
ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక జరగుతున్న కడప జిల్లా బద్వేలులో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం తొలి గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉదయం తొమ్మిది గంటల వరకు మొదటి రెండుగంటల్లో 10.45శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
ఉప ఎన్నికలో భారీ మెజార్టీ గెలవాలని భావిస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని తెలుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తరహాలోనే బయటినుంచివ్యక్తులను తీసుకొచ్చి బద్వేలులో దొంగ ఓట్లు వేయించేందుకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. వైసీపీ ప్లాన్‌లో భాగంగా డీఆర్డీఏకి సంబంధించిన ఓ డ్వాక్రా మహిళను దొంగ ఓట్ల కోసంరంగంలోకి దింపినట్లు సమాచారం. అలాగే అట్లూరు మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలతో పాటు ఇతరులతో మొత్తం కలిపి 600 మందిని వైసీపీ రంగంలోకి దింపినట్లు సమాచారం.వీరందరిని స్థానిక వైసీపీ శ్రేణుల ఇళ్లలో ఉంచి ఈ ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు ప్లాన్ చేస్తునట్లు సమాచారం.
పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ కొందరు దొంగ ఓటర్లను గుర్తించింది. వాళ్లను ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని,దొంగ ఓట్లు వేయిస్తుందని కమలమ్మ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి కూడా వైసీపీ నేతలు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు చేశారు.