కుప్పంలో వైసీపీ అరాచకం.. టీడీపీ నామినేషన్లు చించివేత.. తీవ్ర ఉద్రిక్తత..
posted on Nov 5, 2021 @ 2:37PM
మంచి పాలన లేదు. ప్రజల ఆదరణ అంతకన్నా లేదు. గెలుస్తామనే నమ్మకం అసలే మాత్రం లేదు. ఎలాగైనా గెలవాలనే ఆరాటం మాత్రం ఉంది. అందుకు అధికారపార్టీ ఎంచుకున్న ఏకైక మార్గం అరాచకం. బెదిరింపులతో ప్రతిపక్షాన్ని భయపెడుతోంది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా టీడీపీ అభ్యర్థులను అడ్డుకుంటోంది. దీంతో.. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
అసలే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇలాఖా. కుప్పంలో పసుపు పార్టీకి తిరుగు లేదు. దీంతో, వైసీపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను కొందరు దుండగులు లాక్కెళ్లారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు శుక్రవారమే ఆఖరి రోజు. దీంతో 14వ వార్డుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి నామినేషన్ వేసేందుకు వెళ్లగా.. అతడి నుంచి నామినేషన్ పత్రాలను పలువురు బలవంతంగా లాక్కున్నారు. ఈ పెనుగులాటలో వెంకటేశ్ చేతికి గాయమైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఆగడాలపై అంతా మండిపడుతున్నారు.