పోలీస్ + క్రిమినల్ + పొలిటీషియన్ = మాధవ్!
posted on Aug 4, 2021 @ 7:57PM
పోలీస్ అయితే ఒక రకంగా వార్నింగ్ ఇస్తారు..క్రిమినల్ అయితే ఇంకో రకంగా వార్నింగ్ ఇస్తారు.. ఎంపీ అయితే మరో రకంగా వార్నింగ్ ఇస్తారు..కాని మూడూ అయితే.. ఆ రేంజే వేరుగా ఉంటుంది. హిందూపురం ఎంపీ మాధవ్ పోలీసుగా పనిచేశారు... ఆయనపై ఒక రేప్ కేసు, ఒక మర్డర్ కేసు ఉన్నాయి.. ఆయన వచ్చి నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణ రాజును మళ్లీ టీవీ ముందుకొచ్చి మాట్లాడావంటే నీ అంతు చూస్తా అన్నాడంట.
ఆ పెద్దమనిషి పైన కేసులున్న సంగతి చాలామందికి తెలియదు. అసలాయన 2014లో జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలి తిప్పి మాట్లాడినప్పుడే డౌట్ రావాల్సింది. అప్పుడు అది ఆయన పౌరుషం అనుకున్నారు. కాని తర్వాతే అర్ధమైంది.. బాస్ యాటిట్యూడే అదని. అందరికంటే పాపం కియో మోటార్స్ మేనేజ్ మెంట్ ని అడిగితే ఇంకా బాగా చెబుతారు సార్ గురించి.. సార్ వార్నింగుల గురించి. ఏకంగా సీఎం హాజరైన ప్రోగ్రామ్ లోనే .. ఆయనుండగానే బెదిరించాడంటే.. బాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవాలి.అలాంటోడు మరి పార్లమెంట్ లోనే రఘురామకు వార్నింగ్ ఇచ్చాడంటే .. మాధవ్ బ్యాక్ గ్రౌండ్ తెలిసినోడు ఎవడూ ఆశ్చర్యపోడు.
అసలు రేప్, మర్డర్ కేసులు జేసీ బ్రదర్స్ తో గొడవైతే పెట్టించారని కొంతమంది వైసీపీ సోషల్ మీడియాకార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేసులు ఆయన కర్నూలులో పని చేస్తుండగా 2012లోనే రిజిస్టర్ అయ్యాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్ లోనే ఈ డేటా ఉంది. గెలిచిన ఎంపీల అఫిడవిట్లు పరిశీలించి జాతీయ మీడియా చెప్పేవరకు.. మనకు తెలియనే లేదు. జేసీతో గొడవపడే సమయానికి అనంతపురంలోనే ఉన్నారు..అది 2014. మామూలుగా ఒక కానిస్టేబుల్ పై కేసు బుక్ అయితేనే సస్పెండ్ చేస్తారు. కేసు ప్రూవ్ అయితే డిస్మిస్ చేస్తారు. మరి మనోడు సీఐగా ఎలా కొనసాగాడు అనేదే అర్ధం కావటం లేదు. అంత సీరియస్ కేసులుంటే సస్పెన్షన్ లో ఉండాలి గాని..డ్యూటీలో ఉండి మరీ మీసాలు కూడా మెలితిప్పాడంటే.. మనోడి లాబీయింగ్ మామూలుగా లేదని అర్ధమవుతూనే ఉంది.
అలాంటి సూపర్ కాప్ ను ఎంపీగా గెలిపించుకున్న హిందూపురం ప్రజలకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఎంపీగానే ఇంత అరాచకం చేస్తుంటే.. ఇక సీఐగా ఉన్నప్పుడు ఇంకెన్ని అరాచకాలు చేశాడో .. అక్కడి లోకల్ వాళ్లను అడిగితేనే తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా జీనియస్.. ఆయన మైండ్ సెట్ కు తగ్గవాడిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎక్స్ పర్ట్.. అందుకే మాధవ్ లాంటివాడిని హిందూపురం అభ్యర్ధిగా పెట్టుకుని గెలిపించాడంటే.. గ్రేటే మరి.ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏకంగా ప్రధానికి, స్పీకర్ కి మాధవ్ సార్ వార్నింగుల గురించి కంప్లయింట్ పెట్టారు. మరేం జరుగుతుందో చూడాలి.