తెనాలి శివకుమార్‌ని అరెస్టు చేయండి: ఈసీ
posted on May 13, 2024 @ 3:15PM
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ మీద ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యూలో రమ్మన్నందుకు ఓటర్ని కొట్టడం మాత్రమే కాకుండా, తన అనుచరుల చేత కూడా దాడి చేయించడం పట్ల ఎన్నికల సంఘం సీరియస్ అయింది. శివకుమార్‌ని వెంటనే అరెస్టు చేయాలని, పోలింగ్ ముగిసేవరకు ఆయన్ని గృహ నిర్బంధంలో వుంచాలని ఆదేశించింది.
తెనాలిలో ఓటు వేయడానికి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలో నిల్చోకుండా డైరెక్ట్.గా వెళ్ళిపోతున్నారు. అది చూసిన గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు మీరు కూడా క్యూలో రావాలని రిక్వెస్ట్ చేశారు. అంతే శివకుమార్‌కి ఎక్కడ లేని కోపం ముంచుకుని వచ్చేసింది. ఒక్కసారిగా సుధాకర్ మీదకి దాడి చేసి ఆయన చెంపమీద కొట్టారు. దాంతో రియాక్ట్ అయిన సుధాకర్ కూడా ఎమ్మెల్యే శివకుమార్ చెంప ఛెళ్ళుమనిపించారు. అది చూసిన వైసీపీ ఎమ్మెల్యే పక్కనే వున్న గూండాలు సుధాకర్ మీద దాడి చేసి దారుణంగా కొట్టారు.